పీసీఓడీ అనేది ఒక మల్టీ సిస్టమ్ డిజార్డర్. సాధారణంగా ఇది జన్యుపరంగా సంక్రమించే అవకాశం కూడా ఉంటుంది. ఉన్నట్టుండి బాగా బరువు పెరగడం, తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవడం.. మొదలైన సందర్భాల్లో ఈ సమస్య బయటపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో శరీరంలోని హార్మోన్స్ స్థాయిలు మారతాయి. ఇన్సులిన్ మామూలుగానే ఉత్పత్తి అవుతున్నా.. శరీరం దాన్ని వినియోగించుకోలేదు. ఫలితంగా శరీరంలో ఇన్సులిన్ నిల్వలు ఎక్కువగా ఉండిపోతాయి. ఈ పరిస్థితిని హైపర్ ఇన్సులినీమియా అని అంటారు. శరీరంలో పురుష హార్మోన్లు కూడా ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్ల అసమతౌల్యం వల్ల ఎక్కువగా బరువు పెరగడం, అవాంఛిత రోమాలు, మొటిమలు రావడం.. మొదలైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం అండం విడుదల కాకపోవడమే. కాబట్టి ఇన్‌ఫెర్టిలిటీ, నెలసరి క్రమంగా రాకపోవడం, నెలసరి వచ్చినా రక్తస్రావం ఎక్కువగా అవడం.. మొదలైన సమస్యలు కూడా వస్తాయి. అంతేకాదు.. ఇలాంటి సమస్యతో బాధపడే మహిళలు గర్భం ధరించినా అబార్షన్ అయిపోతుంది. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ముందు పీసీఓడీకి తగిన ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. పీసీఓడీ అనేది చిన్నవయసులో ఉన్న మహిళలకే కాదు.. వయసు పెరుగుతున్న మహిళల్లో కనిపించే ఇలాంటి సమస్యని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. డయాబెటిస్, హై బీపీ, గుండె, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు కనిపించే అవకాశాలున్నాయి. కాబట్టి సమస్యను గుర్తించిన వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకోవడం ఉత్తమం.పీసీఓడీకి గల కారణాలు ఏంటి?
0
పీసీఓడీ అనేది ఒక మల్టీ సిస్టమ్ డిజార్డర్. సాధారణంగా ఇది జన్యుపరంగా సంక్రమించే అవకాశం కూడా ఉంటుంది. ఉన్నట్టుండి బాగా బరువు పెరగడం, తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవడం.. మొదలైన సందర్భాల్లో ఈ సమస్య బయటపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో శరీరంలోని హార్మోన్స్ స్థాయిలు మారతాయి. ఇన్సులిన్ మామూలుగానే ఉత్పత్తి అవుతున్నా.. శరీరం దాన్ని వినియోగించుకోలేదు. ఫలితంగా శరీరంలో ఇన్సులిన్ నిల్వలు ఎక్కువగా ఉండిపోతాయి. ఈ పరిస్థితిని హైపర్ ఇన్సులినీమియా అని అంటారు. శరీరంలో పురుష హార్మోన్లు కూడా ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్ల అసమతౌల్యం వల్ల ఎక్కువగా బరువు పెరగడం, అవాంఛిత రోమాలు, మొటిమలు రావడం.. మొదలైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం అండం విడుదల కాకపోవడమే. కాబట్టి ఇన్‌ఫెర్టిలిటీ, నెలసరి క్రమంగా రాకపోవడం, నెలసరి వచ్చినా రక్తస్రావం ఎక్కువగా అవడం.. మొదలైన సమస్యలు కూడా వస్తాయి. అంతేకాదు.. ఇలాంటి సమస్యతో బాధపడే మహిళలు గర్భం ధరించినా అబార్షన్ అయిపోతుంది. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ముందు పీసీఓడీకి తగిన ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. పీసీఓడీ అనేది చిన్నవయసులో ఉన్న మహిళలకే కాదు.. వయసు పెరుగుతున్న మహిళల్లో కనిపించే ఇలాంటి సమస్యని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. డయాబెటిస్, హై బీపీ, గుండె, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు కనిపించే అవకాశాలున్నాయి. కాబట్టి సమస్యను గుర్తించిన వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకోవడం ఉత్తమం.
Tags
Share to other apps