పిరియడ్‌ పూర్తయిన తర్వాత ఎన్ని రోజులకు అండం విడుదలవుతుంది

Suka Samsaram
0
హలో మేడం. నాకు పెళ్త్లె సంవత్సరం అవుతుంది. ప్రస్తుతం మేము పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాం. పిరియడ్‌ పూర్తయిన తర్వాత ఎన్ని రోజులకు అండం విడుదలవుతుంది. ఆ సమయాన్ని ఎలా కౌంట్‌ చేయాలి? దయచేసి తెలుపగలరు.?

మీకు ఎప్పుడైతే అండం ఉత్పత్తి అవుతుందో ఆ రోజుల్లో పిల్లల కోసం ప్లాన్‌ చేయాలనుకుంటున్నారు. అది సరైన ఆలోచనే కానీ మీకు రుతుక్రమం ఎన్ని రోజులకోసారి వస్తుందో తెలియకుండా అండం ఎప్పుడు విడుదలవుతుందో చెప్పడం కష్టం. ఓవ్యులేషన్‌ అనేది ఎప్పుడైనా రాబోయే నెలసరికి 14 రోజులు ముందుగా జరుగుతుంది. అంటే 28 రోజుల రుతుచక్రం ఉండే వారికి 14వ రోజున, 35 రోజులుండే వారికి 21వ రోజున, 40 రోజులుండే వారికి 26వ రోజున అండం విడుదలవుతుంది. ఈ లెక్క కూడా కచ్చితం కాదు. ఒక నాలుగైదు రోజులు అటూ ఇటుగా జరగచ్చు. అందుకని అండం విడుదలయ్యే సమయానికి నాలుగు రోజుల ముందు నాలుగు రోజుల వెనక లెక్కపెట్టుకొని మొత్తం 9 రోజులు రోజు విడిచి రోజు కలిసి ఉంటే గర్భం నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top