సున్తీ పురుషునిలో సెక్స్‌ తృప్తిని పెంచుతుందా ? - అనుమానాలు అపోహలు

Suka Samsaram
0

సున్తీ పురుషునిలో సెక్స్‌ తృప్తిని పెంచుతుందా ?

పురుషాంగం పూర్వచర్మం సాధారణంగా శిశ్నాన్ని మూసి ఉంచుతుంది. పురుషాంగం యోనిలోకి ప్రవేశిస్తున్న సందర్భంలో లూజుగా వున్న పురుషాంగం పూర్వచర్మం శిశ్నం వెనక్కి వెళ్ళిపోతుంది. శిశ్నంలో కామనాడులు ఉంటాయి. యోనిలో కలిగే ఒరిపిడితో కామనాడులు స్పందించి తృప్తిని కలిగిస్తాయి. పురుషాంగం పూర్వచర్మం సునాయాసంగా శిశ్నం వెనక్కి పోవడం వున్నప్పుడు సున్తీ చేయించుకోవలసిన అవసరం లేదు. కొందరికి ఫైమోసిస్‌ పరిస్థితి ఉంటుంది. వాళ్ళల్లో పురుషాంగ పూర్వచర్మం శిశ్నాన్ని ఎల్లప్పటికీ పూర్తిగా మూసి ఉంచుతుంది.సెక్స్‌లో పాల్గొన్నప్పుడు కూడా వెనక్కి జరగడం ఉండదు. ఇలాంటి సందర్భాలలో శిశ్నానికి నేరుగా ఒరిపిడి కలగగా సుఖం అంతగా అనిపించదు. ఇటువంటి కేసుల్లో తప్పకుండా సున్తీ చేయించుకోవాలి. అప్పుడు వారికి సెక్స్‌లో సరైన తృప్తి లభ్యం అవుతుంది.

కొందరికి సున్తీ తప్పనిసరి :

సెక్స్‌తో ప్రమేయం లేకుండా కొందరికి సున్తీ తప్పనిసరి అవుతుంది. పురుషాంగం పూర్వచర్మం పూర్తిగా మూసి వున్నప్పుడు దానిక్రింద స్మెగ్మా (పాచి) చేరుతుంది. శిశ్నం దగ్గర పాచి చేరడంతో బాక్టీరియా క్రిములు, వైరస్‌ క్రిములు స్థావరం ఏర్పరచుకుంటాయి. దాంతో పురుషాంగం పుండుగా మారుతుంది. సెక్స్‌లో పాల్గొంటే నొప్పిగా కూడా అనిపిస్తుంది.
ఫైమోసిస్‌ పరిస్థితి వున్నవాళ్ళల్లో తరచు మూత్రం మంటపుట్టడం, మూత్ర సంబంధిత వ్యాధులు రావడం ఉంటాయి. కొందరికి పురుషాంగ పూర్వచర్మం తేలికగా వుండకుండా కాస్త టైట్‌గా ఉంటుంది. దానివల్ల అంగం స్తంభించినప్పుడు తేలికగా వెనక్కి జరగక చర్మం తెగడం ఉంటుంది. పురుషాంగం పూర్వచర్మం పూర్తిగా మూసి వుంచినా లేదా టైట్‌గా వున్నా సున్తీ తప్పనిసరిగా చేయించుకోవాలి.

పురుషాంగానికి కేన్సరు :

పురుషాంగం పూర్వచర్మం క్రింద, శిశ్నం దగ్గర రోజూ పాచి పేరుకుని ఉంటుంది. రోజూ దంతధావనం చేస్తున్నట్లుగానే స్నానం చేసినప్పుడు పురుషాంగ పూర్వచర్మాన్ని వెనక్కి లాగి సబ్బుతో రుద్ది క్లీన్‌ చేసుకోవాలి. ఆవిధంగా శుభ్రం చేసుకోకపోతే అక్కడ చేరిన పాచిలో హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ చేరి నిదానంగా పురుషాంగానికి కేన్సరు కలిగిస్తుంది. పురుషాంగానికి కేన్సరు రావడమనేది సున్తీ చేయించుకున్న వారికంటే చేయించుకోనివారిలో చాలా ఎక్కువ. యూదులు, మరికొందరు మగబిడ్డ పుట్టిన మరుసటి రోజే వారి ఆచారంగా సున్తీ చేస్తారు. అలా చిన్నప్పుడే సున్తీ చేయబడిన మగవాళ్ళల్లో పురుషాంగ కేన్సరు రావడం చాలా అరుదు. స్త్రీలల్లో గర్భాశయ కంఠ కేన్సరు (సర్విక్స్‌ కేన్సరు) రావడానికి పురుషునిలో శిశ్నం దగ్గర పాచి పేరుకొనడం ఒక ప్రధాన కారణం. పురుషుడు మర్మావయవాల శుభ్రతని పాటించకపోతే అతడి పాచి భార్యకి చేరి అక్కడ హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ చోటుచేసుకొని సర్విక్స్‌ కేన్సరుని కలిగిస్తాయి. ఈ పరిస్థితిని దృష్టిలో వుంచుకుని కొందరు తమ మగబిడ్డలకి చిన్నతనంలోనే రొటీన్‌గా సున్తీ చేయిస్తారు. సెక్స్‌ హైజిన్‌ రీత్యా సున్తీ మంచిది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top