స్పెర్మ్‌ బయటికి వస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలున్నాయా?

Suka Samsaram
0
నేను నా భర్తతో కలిసినప్పుడు స్పెర్మ్‌ బయటికి వచ్చింది. ఇలా జరగడం వల్ల నాకు ప్రెగ్నెన్సీ వచ్చే
అవకాశాలున్నాయా? గర్భం ధరించాలంటే నెలసరి వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు, ఎన్ని రోజుల పాటు కలవాల్సి ఉంటుంది..? 

కలయిక సమయంలో ఇలా స్పెర్మ్‌ బయటికి రావడం అన్నది సర్వసాధారణం. చురుకుగా కదిలే స్పెర్మ్స్‌ వాటంతట అవే గర్భాశయ ముఖద్వారం నుంచి గర్భాశయంలోకి, అక్కడి నుంచి ఫెలోపియన్‌ ట్యూబుల్లోకి ప్రవేశిస్తాయి. సెమెన్‌లో ఉన్న ద్రవపదార్థం మాత్రం బయటికి వచ్చేస్తుంది. అందుకని ఇలా జరగడం వల్ల ప్రెగ్నెన్సీ రాదు అన్న భయం అవసరం లేదు. మీరు ఫెర్త్టెల్‌ పిరియడ్‌ గురించి అడిగారు. మీకు నెలసరి క్రమం తప్పకుండా 28 రోజుకోసారి గనుక వస్తున్నట్లయితే నెలసరి వచ్చిన 10వ రోజు నుంచి 18వ రోజు వరకు రోజు విడిచి రోజు కలిసుంటే సరిపోతుంది. ఈ సమయంలో అండం విడుదలవుతుంది కాబట్టి గర్భధారణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top