అధికశాతం స్త్రీలలో బహిష్టుస్రావం కనబడిన 10వ రోజునుంచి 18వ రోజులోపల అండం విడుదల అవుతుంది. ఎక్కడో చాలా కొద్దిమందిలోనే ఇలా కాకుండా బహిష్టుకి ముందూ-వెనకా ఎప్పుడైనా జరగవచ్చు. అండం విడుదల తెలుసుకోవడం కోసం ఏ స్త్రీ అయినా బహిష్టుస్రావం కనబడిన మొదటిరోజు నుంచి తిరగి బహిష్టు కనబడేవరకు ఒక పద్ధతి ప్రకారం శరీర ఉష్ణోగ్రతని రికార్డు చేయాలి. తాను నిద్రలేస్తూనే ఇంకా మంచం కూడా దిగకుండా నోట్లో థర్మామీటరు పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న థర్మామీటరుని రెండు నిమిషాలు నోట్లో వుంచుకోవాలి. ఆ తరువాత థర్మామీటరులో ఎంత టెంపరేచరు వున్నదీ చూడాలి. ఇలా చూపిన టెంపరేచరుని ఒక కాగితం మీద నోట్ చేయాలి. ఏ రోజుకారోజు బహిష్టుస్రావమై, అప్పటికి ఎన్నో రోజో, ఏ తారీసాధారణంగా మొదటి కొద్దిరోజులు శరీర ఉష్ణోగ్రత 97.6 లేదా 98 డిగ్రీల ఫారన్‌హీట్ వుంటుంది.
అండం విడుదలతో పెరిగే శరీర ఉష్ణోగ్రత
ఇలావుండగా నెలమధ్యలో అకస్మాత్తుగా టెంపరేచర్ 98.6 లేదా 99 డిగ్రీలుకి పెరుగుతుంది. అలా సడన్‌గా పెరిగిన టెంపరేచర్ 10-12 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తరువాత తగ్గిపోయి రెండు మూడు రోజుల్లో బహిష్టుస్రావం కనబడుతుంది.థర్మామీటరులో అకస్మాత్తుగా టెంపరేచర్ పెరిగిన రోజు అండం విడుదల జరిగిన రోజు. అండం విడుదలైన రోజు నుంచి శరీరం ఉష్ణోగ్రత కనీసం అర డిగ్రీ ఎక్కువ అవుతుంది. సాధారణంగా ఒక డిగ్రీ ఎక్కువ వుంటుంది. డిగ్రీ లేదా అరడిగ్రీ ఉష్ణోగ్రత పెరగడానికి అండం విడుదలతో ఆమెలో ప్రొజిస్టరోన్ హర్మోన్ అధికంగా ఉత్పత్తి కావడం కారణం. ప్రొజిస్టిరోన్ హ ర్మోన్‌కి శరీరంలో అధిక ఉష్ణోగ్రతని కలిగించే గుణం వుంది. అందుకే అండం విడుదలతో శరీరం ఉష్ణోగ్రత పెరుగుతుంది. శరీరం ఉష్ణోగ్రతని రోజూ థర్మామీటరుతో కొలిచి నోట్ చేస్తున్నప్పుడు కొందరుస్త్రీలలో ఒక వింత పరిస్థితి కూడా కనబడుతుంది. అకస్మాత్తుగా నెలమధ్యలో అరడిగ్రీ ఉష్ణోగ్రత డౌన్ అయిపోతుంది. మరుసటిరోజు అదే స్త్రీలో అంతకుముందు రీడింగ్ కంటే డిగ్రీ లేదా అరడిగ్రీ మామూలుగా కంటే ఎక్కువ అవుతుంది.
అండం విడుదల కలిగించే కడుపు నొప్పి
కొందరు స్త్రీల విషయంలో అకస్మాత్తుగా శరీర ఉష్ణోగ్రత పెరిగినట్లు కనబడిన రోజున పొత్తి కడుపులో కొద్దిగా నొప్పి అనిపిస్తుంది. మరికొందరిలో కొద్ది రక్తపు చుక్కలు యోని దగ్గర బట్టకు అవుతాయి. ఇవన్నీ ఆమెలో అండం విడుదలైన చిహ ్నలే. స్త్రీకి గర్భం రావడం జరిగితే పెరిగిన శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా కంటిన్యూ అవుతుంది. అందుకనే గర్భం దాల్చిన తొలిదినాల్లో కొందరు స్త్రీలు తమ ఒళ్ళు వెచ్చగావుందని, జ్వరం వచ్చినట్లు అదోలా వుందని అంటారు. అండం విడుదలైనా గర్భం దాల్చడం జరగకపోతే ఉష్ణోగ్రత పెరిగిన 10-12 రోజుల్లో తిరిగి శరీర ఉష్ణోగ్రత పూర్వం స్థాయికి పడిపోతుంది. అండం విడుదల లేనివాళ్ళలో నెలంతా శరీర ఉష్ణోగ్రత మార్పులేకుండా ఒకే విధంగా వుంటుంది. నెల నెలా శరీర ఉష్ణోగ్రత పట్టికలని తయారుచేయడం వల్ల స్త్రీకి నెలనెలా సక్రమంగా అండం విడుదల అవుతున్నదీ లేనిదీ తెలుస్తుంది. అలాగే బహిష్టు అయిన తరువాత ఎన్నిరోజులకి అండం విడుదల అవుతున్నదీ స్పష్టంగా తేలుతుంది. సాధారణంగా ప్రతినెలా ఒకే సమయంలో అండం విడుదల అవుతుంది. దీన్ని బట్టి అన్నీ సక్రమంగా వుండి గర్భం రానివాళ్ళు తమంతట తాము అండం ఏ రోజుల్లో విడుదల అవుతున్నదో తెలుసుకుని ఆ దినాల్లో మిస్ అవకుండా దాంపత్యంలో పాల్గొనవచ్చు.
నెలలో ఎన్ని అండాలు విడుదలవుతాయి?
స్త్రీలో కుడివైపు ఒక ఓవరీ, ఎడమవైపు మరొక ఓవరీ వుంటాయి. ఒక నెల ఒకవైపు ఓవరీ నుంచి అండం విడుదలైతే మరొక నెల రెండవవైపు ఓవరీ నుంచి అండం విడుదల అవుతుంది. అది కూడా ఒకటే అండం. ఆ అండం కూడా నెలకి ఒకసారే. విడుదలైన అండానికి వీర్యకణంతో సంయోగం చెంది పిండంగా మారే శక్తి 12 నుంచి 24 గంటలు మాత్రమే వుంటుంది.
పై విధంగా అండం విడుదల ఎవరు మటుకువారు తెలుసుకోవడం వుండగా బహిష్టుకి ముందు చిన్నాపరేషన్‌చేసి దాని ద్వారా వచ్చే ఎండోమెట్రియం బిట్స్‌ని హిస్టోపథలాజికల్ ఎగ్జామినేషన్ చేస్తే ఆ స్త్రీలో అండం విడుదల వున్నదీ లేనిదీ తెలుస్తుంది. అలాగే బహిష్టు అయిన 10వ రోజు నుంచి రోజూ ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే ఓవరీస్ నుంచి అండం విడుదల అవడం కూడా తెలుస్తుంది.
ఖో ఆనాటి టెంపరేచర్‌కి ఎదురుగా నోట్ చేయాలి.