సెక్స్‌ అపోహలు - వాస్తవాలు

Suka Samsaram
0
యుక్తవయస్సు వచ్చిన దగ్గర్నుంచి 92 నుంచి 98 శాతం పురుషులలో హస్త ప్రయోగం అలవాటు ఉంది. హస్త ప్రయోగం అప్పుడప్పుడు చేసేవాళ్లూ ఉంటారు. రోజూ చేసేవాళ్లు ఉంటారు. ఒకే రోజులో పలుమార్లు చేసేవాళ్లు ఉంటారు. హస్త ప్రయోగం చేయనివాళ్లు ఎవరూ ఉండరు.
ఎవరైనా మేము ఎప్పుడూ హస్త ప్రయోగం చేయలేదని అంటే వాళ్ళలో ఏదన్నా లోపం ఉందేమో పరీక్షించాలి. మెంటల్‌ రిటార్డేషన్‌ (మానసిక ఎదుగుదల లేనివాళ్ళు), సెక్స్‌ హ ర్మోను లోపం, మానసిక వ్యాధి ఉన్నవాళ్లల్లో సెక్స్‌ పరమైన కోరికలు కలగవు. సెక్స్‌ పరమైన కోరికలు కలగనప్పుడు హస్త ప్రయోగం చేయాలని ఉండదు.
హస్త ప్రయోగం చేయడం సెక్స్‌ పరంగా అతనిలో మానసిక పరిపక్వత వచ్చిందనడానికి చిహ్నం. ఆకలి వేస్తే అన్నం తినడం ఎంత సహజమో, యుక్త వయస్సు వచ్చిన తర్వాత సెక్స్‌ కోరిక కలిగి హస్త ప్రయోగం చేయడం అంతగానే సహజం. వీర్యం ఎంత పోయినా మనిషి నీరసించడు. వీర్యం ఏ మాత్రం బలవర్థక పదార్థం కాదు. బలవర్థక పదార్థాల నుంచి వీర్యం తయారు కాదు. అందువల్ల వీర్యం పోతే బలవర్థక పదార్థం దీని కోసం వృధా అయిందని అనుకోనవసరం లేదు. ఒక వీర్యం బొట్టు వంద రక్తపు బొట్లతో సమానమని ఒక అపోహ ఉంది. వీర్యం ఏ మాత్రం విలువైంది కాదు కనుక ఇది అర్థంలేని మాట. వంద రక్తపు బొట్లు కలిసి ఒక వీర్యపు బొట్టుగా మారడమనేది కూడా జరగదు.

వీర్యం తయారీ
వీర్యం అనేది ముఖ్యంగా రెండు భాగాలుగా విభజించుకోవచ్చు. ఒకటి- వీర్య కణాలు, రెండు-తెల్లని ద్రవం. వీర్యకణాలు వృషణాల (టెస్టికల్స్‌) నుండి ఉత్పత్తి అవుతాయి. మొత్తం వీర్యరాశిలో వీర్యకణాలరాశి ఒకశాతం మాత్రమే. తక్కిన 99 శాతం కేవలం తెల్లని ద్రవం.

హస్త ప్రయోగం గురించి అర్థంలేని అపోహలు
హస్త ప్రయోగం చేస్తే వీర్యనష్టం కలిగి మనిషి నీరసించి పోతాడని, నరాలు దెబ్బతింటాయని, జ్ఞాపకశక్తి తగ్గుతుందని, కంటి చూపు తగ్గుతుందని, పెళ్ళికి పనికిరారని, అంగం పటిష్టంగా నిలబడదని, ఆయుష్షు తగ్గిపోతుందని- ఇలా ఎన్నో అపోహలు, అను మానాలు సమాజంలో ప్రబలి ఉన్నాయి. ఏండ్ల కొలది ఇటువంటి అపోహలు, అనుమానాలు సమాజంలో ఉంటూ వస్తున్నాయి. ఈ అనుమానాలు, భయాలు అన్నీ అర్థం లేనివే. అశాస్త్రీయమైనవే.
వీర్యానికి సంబంధించిన ద్రవం ముఖ్యంగా ప్రోస్టేటు గ్రంధి నుంచి తయారవుతుంది. 

వీర్యం అంటే...
ప్రోస్టేటు గ్రంధితోపాటు శుక్రకోశాలు కూడా కొత్త ద్రవాన్ని తయారు చేస్తాయి. అలాగే కౌపర్స్‌ గ్రంధులు కూడా కొద్దిగా ద్రవాన్ని తయారు చేస్తాయి. అయితే శుక్రకోశాలు, కౌపర్స్‌ గ్రంధులు తయారుచేసే ద్రవం చాలా తక్కువ. ప్రోస్టేటు గ్రంధి విడుదలచేసే ద్రవం చాలా ఎక్కువ. ప్రోస్టేటు గ్రంధి, శుక్రకోశాలు, కౌపర్స్‌ గ్రంధి విడుదలచేసే ద్రవాలలో కొన్ని రసాయనాలు వుంటాయి. శరీరంలో అన్ని ద్రవాల్లో ఉండే విధంగానే వీటిల్లోనూ ఈ రసాయ నాలు ఉంటాయి. అంతేతప్ప అవి ప్రత్యేకమైనవీ కావు. ఎక్కువ శాతమూ కాదు. వీర్యంలో ఉండే రసాయనకాలు వేరే ఇంకేమీ కాదు- ఆల్బుమిన్‌, ఫాస్పరస్‌, సోడియం క్లోరైడ్‌, సోడియం ఫాస్పేట్‌, ఆకైస్డ్‌, సెమినల్‌ గ్రాన్యూల్స్‌, ఎమైనో యాసిడ్స్‌ ఉంటాయి. ఇవి అతి సాధారణమైనవి.
వృషణాల్లో తయారైన వీర్యకణాలు వీర్యవాహికల ద్వారా పాకుకుంటూ శుక్రకోశాల దాకా వస్తాయి. అక్కడినుంచి పురుషాంగం ద్వారా స్ఖలింపబడటానికి చేయూత కావాలి. శుక్రకోశాల్లోనూ, ప్రోస్టేటు గ్రంధిలోనూ తయారయ్యే ద్రవం వీర్యకణాలని ఎక్కువ సంఖ్యలో ఒక్కసారిగా బయటకు నెట్టడానికి తోడ్పడుతుంది.

వీర్యం విడుదల
శుక్రకోశాలదాకా చేరిన వీర్యకణాలు అక్కడే ఆగుతాయి. ఆపైన బయటకు రావడానికి ప్రత్యేక పరిస్థితులు కావలసిందే. ఆ ప్రత్యేక పరిస్థితే - సెక్స్‌ యాక్ట్‌. మనిషిలో సెక్స్‌ ప్రేరణ కలగగానే వృషణాల దగ్గరనుంచి శుక్రకోశాలు, ప్రోస్టేటు గ్రంధివరకుఅలజడి మొదలవు తుంది. అవన్నీ ఎలర్ట్‌ అయిపోతాయి. చకచకా యాక్షన్‌లోకి వచ్చేస్తాయి.
సెక్స్‌ క్లైమాక్స్‌కి చేరగానే నాడీ యంత్రాంగం హై ఫ్రీక్వెన్సీలో స్టిమ్యులేషన్‌ ఇవ్వగా వీర్యవాహికలు, శుక్రకోశాలు, ప్రోస్టేటు గ్రంధి ఒక్కసారిగా కాంట్రాక్టు అవుతాయి. ముఖ్యంగా ప్రోస్టేటు గ్రంధి నిమ్మకాయ పిండబడినట్లు స్కీ ్వజ్‌ అవుతుంది. ఒక్కసారిగా ఈ ద్రవం గోదావరి వెల్లువలా వీర్యకణాలని కలుపుకుని స్ఖలింపబడుతుంది. అదే వీర్యస్ఖలనం.
కలిగిన సెక్స్‌ కోరిక, సెక్స్‌ ప్రేరణను బట్టి ప్రోస్టేటు గ్రంధి స్క్వీజ్‌ అవడం (ముడుచు కోవడం) వుంటుంది. సెక్స్‌ కోరిక, ప్రేరణ ఎక్కువ వుంటే నరాల ఉద్రిక్తతతో ప్రోస్టేటు గ్రంధి ఎక్కువగా స్క్వీజ్‌ అయి ఎక్కువ ద్రవం స్ఖలిస్తుంది. ఒకసారి ప్రోస్టేటు గ్రంధి స్క్వీజ్‌ అయిన తరువాత తిరిగి అందులోని గ్రంధులు యాక్టివ్‌ అయి ద్రవాన్ని తగినంత తయారు చేయడానికి కొన్ని గంటల వ్యవధి పడుతుంది.
యౌవనంలో వుండగా ఈ గ్రంధి ఎక్కువ చైతన్యవంతంగా వుండి తక్కువ వ్యవధిలోనే ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది.
మలమూత్ర విసర్జన సమయంలో వీర్యస్ఖలనం
కొందరిలో సెక్స్‌పరంగా ఎగ్జయిట్‌కాకుండానే మల, మూత్ర విసర్జన సమయంలో పురుషాంగం నుంచి వీర్యం కొంత విడుదల అవుతుంది. ఆ సమయంలో శుక్రకోశాలు,ప్రోస్టేటు గ్రంధిమీద కొంత ఒత్తిడి కలిగి ద్రవం బయటకు రావడమే కారణం. నోట్లో లాలాజల గ్రంధులు లాలాజలాన్ని ఎలా తయారుచేస్తున్నాయో ప్రోస్టేటు గ్రంధికూడా ద్రవాన్ని అలాగే తయారుచేస్తుంది. అంతేతప్ప వృషణాల్లోకీ, ప్రోస్టేటు గ్రంధిలోకీ ప్రసరించే రక్తం విలువైన పదార్థాలు వీర్యంగా మారడంగానీ జరగదు.

వీర్యం ప్రయోజనం
ఒక ముఖ్య విషయాన్ని గమనించాలి- నోట్లోని లాలాజలం నోటిని తడిగా వుంచడానికి తోడ్పటమేగాకుండా ఆహ రం జీర్ణం అవడానికి కూడా తోడ్పడుతుంది. వీర్యం విషయం తీసుకుంటే అందులోని వీర్యకణాలు గర్భధారణకి తప్ప ఇంకెందుకూ తోడ్పడవు. వీర్యంలోని ద్రవం శుక్రకోశాల్లో వీర్యకణాలు బ్రతికి వుండటానికి, ఆ తరువాత వాటిని బయటకు తీసుకు రావడానికి సాధనంగా తప్ప ఇంకెందుకూ తోడ్పడదు. వీర్యనష్టం కలగకుండా నిరో ధించుకుంటే తేజస్సు పెరుగుతుందనుకోవడం తెలియక అనుకోవడమే. అసలు జన నేంద్రియాల్లో తయారైన వీర్యం ఒంటికి చేరడం వుండదు. వయస్సు పెరుగుతున్నకొద్దీ ప్రోస్టేటుగ్రంధిలో కణాలుపనిచేయడం తగ్గి వీర్యం తక్కువ ఉత్పత్తి అవుతుంది. అలాగే రసాయనకాల్లో కొంత మార్పు వచ్చి వీర్యం రంగు మారుతుంది. తెలిసో తెలియకో ఎంత వీర్యం పోయినా, ఎంత చిన్న వయస్సు నుంచి పోయినా ఎటువంటి నష్టం కలగదు. దాంపత్య జీవితంలో ఎటువంటి అసంతృప్తి ఏర్పడదు.
హస్తప్రయోగం చేయడం వల్ల అంగం పటిష్టత కోల్పోవడం, అంగం మెత్తబడి పోవడం, సెక్స్‌లో పాల్గొనకపోవడం జరగనే జరగదు. కాని కొందరు హస్తప్రయోగం గురించి అన వసరంగా ఆందోళన చెందుతారు.
సెక్స్‌ విషయంలో ఏ మాత్రం భయం ఉన్నా, ఆందోళన ఉన్నా సెక్స్‌ చేయలేమనే పిరికితనం ఉన్నా, ఏదో తప్పు జరిగిపోయిందనే అపరాధ భావం ఉన్నా అంగం సరిగ్గా స్తంభించదు. ఒకవేళ స్తంభించినా మధ్యలోనే అంగం మెత్తబడుతుంది. దీనినే 'సెక్సువల్లీ రిలేటెడ్‌ యాంక్జైటీ' అంటారు.
తన పర్‌ఫార్మెన్స్‌ గురించి మనసులో అంతర్లీనంగా ఏమాత్రం ఉన్నా రతిలో పాల్గొ న్నప్పుడు అంగం డౌన్‌ అవుతుంది. అందుకని హస్తప్రయోగం ఏమాత్రం తప్పుకాదని దాని వల్ల సెక్స్‌ బలహీనత కలగదని స్పష్టంగా తెలుసుకోవాలి. మనసులో నించి అర్థం పర్థంలేని అనుమానాలని, భయాలని పూర్తిగా తొలగించుకోకపోతే అంగస్తంభన వైఫల్యం కలిగే అవకాశం ఉంది. సెక్స్‌ విజ్ఞానం లేకపోవడం వల్లనే శరీరంలో ఏ బాధ కలిగినా ఏ తేడా వచ్చినా హస్తప్రయోగం వల్ల, వీర్యనష్టం వల్ల అని అనుమానపడటం, భయపడటం జరుగుతుంది. ఆ భయమే వారి అంగస్తంభన వైఫల్యానికి కారణమవుతుంది. అంతే తప్ప హస్తప్రయోగం కారణం కానే కాదు.

నకిలీ సెక్స్‌ స్పెషలిస్ట్‌లు- కాలం చెల్లిన సిద్ధాంతాలు
కొందరు సెక్స్‌ స్పెషలిస్ట్‌లమని ప్రచారం చేసుకుంటూ హస్తప్రయోగం వల్ల వీర్యనష్టం వల్ల పెళ్ళికి పనికి రాకుండా అవుతారని జనాలని భయపెడుతూ ఉంటారు. ఏవేవో మందు లిస్తూ డబ్బులు దోచేస్తూ ఉంటారు. వాస్తవానికి ఇలా చెప్పేవాళ్ళు ఎవరూ నిజమైన సెక్స్‌ స్పెషలిస్ట్‌లు కానేకాదు. వాళ్ళు చెప్పేవన్నీ మోసపు మాటలే. సెక్స్‌ విజ్ఞానం లేనివారి అమాయ కత్వాన్ని, అజ్ఞానాన్ని సొమ్ము చేసుకునేవాళ్ళే.
కొందరు దేశీయ వైద్యం పేరిట ప్రాచీన గ్రంథాలలో హస్తప్రయోగం హ నికరం అని, వీర్యం ఎంతో విలువైందని, వీర్యం పోతే మనిషి సెక్స్‌ పరంగా బలహీనమవుతుడాడని రాసి ఉందని చెబుతూ జనాలని భయపెడుతూ అర్థంలేని వైద్యాలన్నీ చేస్తారు. వాళ్ళు చెప్పే మాటలన్నీ అశాస్త్రీయమైనవే. ఆధునిక వైద్య విజ్ఞానం హస్తప్రయోగం ఏ మాత్రం హ నికరం కాదని పైగా ఆరోగ్య లక్షణమని, వీర్యం ఏమాత్రం విలువైంది కాదని శాస్త్రీయంగా విశ్లేషణ చేసి నిరూపించింది. అయినా ప్రాచీన వైద్య గ్రంధాలలో ఏదో రాసుందని అది నమ్మమని చెప్పడం హ స్యాస్పదం.
పూర్వకాలం భూమి బల్లపరుపుగా ఉందనుకునే వాళ్ళు సూర్యుడు తూర్పుని బయలుదేరిపడమరకి ప్రయాణం చేస్తాడని అనుకునేవారు కాని అభివృద్ధి చెందిన సైన్స్‌ అవన్నీ తప్పని రుజువు చేసింది. వాస్తవం ఏమిటో ఈనాడు అందరికీ తెలుసు. అదే విధంగా ఆధునిక వైద్య విజ్ఞానం ఎన్నో పాత అభిప్రాయాలని తప్పని రుజువు చేసి చూపించి ఏది నిజమో నిర్ధారణ చేసింది. ఇంకా కొందరు కాలం చెల్లిన భావాలని, అశాస్త్రీయమైన వాటిని పట్టుకుని వాటినే నిజమనుకోవడం వట్టి మూర్ఖత్వం.

స్త్రీలలోనూ హస్తప్రయోగం అలవాటు
స్త్రీలలో కూడా హస్తప్రయోగం అలవాటు ఉంటుంది. అయితే హస్తప్రయోగం అలవాటు గురించి పురుషులు భయపడినంత స్త్రీలు భయపడరు. అయితే వారిలో కూడా హస్తప్రయోగం (స్వయంతృప్తి) గురించి అర్థంలేని అనుమానాలు, భయాలు ఉంటాయి.
స్త్రీలలో 62 శాతం మందికి స్వయంతృప్తి అలవాటు వుంటుంది. పురుషులతో పోల్చి నట్లయితే స్త్రీలలో స్వయంతృప్తి అలవాటు తక్కువ. దీనికి కొంత కారణం చిన్నతనంలోనే వారిని ఈ విషయంలో హెచ్చరించడమే.
36 శాతం ఆడపిల్లలు పుట్టిన మొదటి సంవత్సరంలోనే తెలియకుండా మర్మావయవాల దగ్గర రుద్దుకోవడం చేస్తారు. అది వారికి ఒక విధమైన హ యినిస్తుంది. రెండు, మూడు సంవత్సరాల వయసులో మరింతఎక్కువగా చేస్తారు. అది గమనించిన తల్లిదండ్రులు వారిని కోప్పడటం, చెడు అలవాటుగా పేర్కొనడం జరుగుతుంది. దానితో వారు భయపడి ఆ అల వాటుకి దూరం అవుతారు.

స్త్రీలలో స్వయంతృప్తి అలవాటు శాతం
తిరిగి 12-13 సంవత్సరాలు వచ్చేసరికి 30 శాతం మంది స్వయంతృప్తికి అలవాటు పడతారు.20 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి 30 శాతానికి పైగా ఈ అలవాటుకు లోనవుతారు.
స్త్రీలలోనైనా, పురుషులలోనైనా స్వయంతృప్తి అలవాటు అతి సహజమైనది. హ ని లేనిది. ఈ అలవాటు ఆరోగ్యకరమైనదే తప్ప నరాల బలహీనత కలిగించేది కాదు.
స్త్రీలలో సెక్స్‌ ఆలోచనలు కలిగినప్పుడు మర్మావయవాలని చేతితో ఒరిపిడి కలిగించడం, యోని శీర్షాన్ని వేలుతో ప్రేరేపించడం చేస్తారు. జననేంద్రియాల్లోకి వేలుపోనిచ్చి ఒరిపిడి కలిగించడం జరుగుతుంది.
కొందరు వక్షోజాల దగ్గరనుంచి ప్రేరణ కలిగిస్తూ చివరికి తమ చేతులని మర్మా వయవాల దగ్గరికి చేరుస్తారు. మరికొందరు తొడలని రెండింటినీ గట్టిగా అదిమి ఒత్తిడి కలిగించి హ యిని పొందుతారు.
స్వయంతృప్తి ఏ విధంగా పొందినా నష్టం ఏమి వుండదు. పైగా సెక్స్‌పరంగా మనసుని ట్యూన్‌ చేయడం తెలుసుకుంటారు.

స్త్రీలో స్వయంతృప్తి- సెక్స్‌తృప్తి
సెక్స్‌ శాస్త్రజ్ఞుల పరిశీలనల ప్రకారం స్వయంతృప్తి అలవాటు వున్నవారు దాంపత్య సంబంధాలలో ఎక్కువ తృప్తిని, హ యిని పొందుతారు. దాంపత్యంలో భర్తకి తగు తోడ్పాటు అందించి ఆనందింపచేయడమే కాకుండా తామూ ఆనందిస్తారు. స్వయంతృప్తి అలవాటు వున్న స్త్రీలకి నరాలు మొద్దుబారుతాయనీ, అసలు సెక్స్‌లో ఆనందించలేరనీ అపోహ వుంది. అలాగే స్వయంతృప్తివల్ల సంతానం కలగదని, స్త్రీ సౌందర్యం తగ్గిపోతుందని అనుకుంటారు. ఇవన్నీ ఏమాత్రం నిజాలు కాదు.
స్వయంతృప్తి అలవాటు పెళ్ళి అయిన వారిలో, కాని వారిలో కూడా వుంటుంది. భర్త దగ్గర్లో లేనప్పుడు, భర్త శీఘ్రస్ఖలనంతో రతిని అతి త్వరితంగా ముగించినప్పుడు స్వయం తృప్తితో చెలరేగిన కామోద్రేకాన్ని పరిపూర్ణం చేసుకుని హ యిగా మారడం వుంటుంది.అలాగైనా కోరిక పరిపూర్ణం కాకపోతే న్యూరోటిక్‌గా మారడం, చికాకు, కోపం పెరగడం వంటివి జరుగుతాయి.

రతిలో జడత్వం ఉన్నవారికి చికిత్సగా హస్త ప్రయోగం
రతిలో జడత్వం (ఫ్రిజిడిటి) వున్నవారికి ఆర్గాజం (సుఖప్రాప్తి) పొందడమెలాగో శిక్షణ ఇవ్వడానికి స్వయంతృప్తిని ఒక సాధనంగా పేర్కొనడం వుంటుంది. స్వయంతృప్తిలోని భాగమే వైబ్రేటర్స్‌ ఉపయోగం కూడా.
కొందరు స్త్రీలలో హైపోసెక్సువాలిటీ ఉంటుంది. వారిలో సెక్స్‌ స్పందనలు చాలా ఆలస్యంగా కలుగుతాయి. ఇటువంటి వారి విషయంలో భర్త ముందుగా యోని శీర్షాన్ని ప్రేరేపించాలి. మర్మావయవాల దగ్గర ఒరిపిడి చేయాలి. ఆమెలో కామోద్రేకం కలిగే వరకు భర్త అలా చేయాలి. లేదా భార్య అయినా ముందుగా స్వయంతృప్తి పద్ధతి ద్వారా మనసుని సమాయత్తం చేయాలి. అప్పుడే సరిగ్గా శ్రుతిపెట్టిన వీణలాగా కామనాడులన్నీ స్పందించడం వుంటుంది.
పురుషులలోగానే స్త్రీలలో కూడా స్వయంతృప్తి గురించి అర్థంలేని భయాలు అను మానాలు వున్నాయి. స్వయంతృప్తి అలవాటు ఏ వయసులో వున్నవారికైనా పెళ్లైనవారికీ-కాని వారికీ ఏ హ నీ కలిగించదు.పైగా అసలు రతి సక్రమంగా తృప్తి పొందడానికి శిక్షణ ఇస్తుంది.

స్వప్నస్ఖలనాలు- సెక్స్‌ బలహీనత
యుక్తవయస్సు వచ్చిన దగ్గర్నుంచి చాలామందిలో తరచుగానో అప్పుడప్పుడో నిద్రలో వీర్యం పడిపోతుంది. కొందరికైతే సెక్స్‌పరమైన కలలు వచ్చి వీర్యం పడుతుంది. నిద్రలో ఇలా వీర్యం పోవడాన్ని స్వప్న స్ఖలనాలుగా పేర్కొంటారు.స్వప్న స్ఖలనాలు నరాల బలహీనత వల్ల కలగవు. యుక్తవయసు వచ్చిన దగ్గర్నుంచి వీర్యం తయారవుతూనే ఉంటుంది. అలా తయారయిన వీర్యం హస్త ప్రయోగం అలవాటుల్లో, స్వప్న స్ఖలనాలరూపంలోనో, మల విసర్జనకి మూత్రానికి వెళ్ళినప్పుడో పోతూనే ఉంటుంది.
వీర్యం పోకుండా ఆపుకుందామన్నా ఆగేది కాదు. వీర్యం పోకుండా నిరోధించుకున్నా ఎటువంటి లాభం లేదు. వీర్యం పోవడం ఎటువంటి నరాల బలహీనత కాదు, సెక్స్‌ బలహీనత కాదు. వీర్యం పోకుండా ఆపడానికి ఎటువంటి మందులు వాడనవసరం లేదు.

వీర్యం చిక్కన - సెక్స్‌ సామర్థ్యం
చాలామంది వీర్యం చిక్కగా ఉంటే సెక్స్‌పరంగా బలంగా ఉన్నట్లు వీర్యం పలచగాఉంటే సెక్స్‌పరంగా బలహీనత ఉన్నట్లు భావిస్తారు. వీర్యం చిక్కగా ఉన్నా, పలచగా ఉన్నా ఒకటే. వీర్యం చిక్కగా ఉండటం కోసమని కొందరు దేశీయ వైద్యులు, నాటు వైద్యులుఏవేవో మందులు ఇస్తారు. వీర్యం పలచగా ఉంటే సెక్స్‌లో తగినంత ఎంజాయ్‌మెంట్‌ కలగదని,స్త్రీ కూడా ఆ పురుషుని వల్ల తృప్తి చెందదని కల్లబొల్లి కబుర్లు అనేకం వినిపిస్తారు. అలాగే వీర్యం పలచగా ఉంటే సంతానం కలగదని భయపెడతారు. వీర్యం పలచగా ఉన్నా చిక్కగా ఉన్నా స్త్రీకి ఒకటే విధంగా తృప్తి కలుగుతుంది.పురుషునికి కూడా వీర్యం పలచగా ఉన్నా, చిక్కగా ఉన్నా ఒకే విధంగా తృప్తి కలుగుతుంది.

వీర్యం పలచన- సంతానం
వీర్యం పలచగా ఉంటే సంతానం కలగదనడం అర్థరహితం. సంతానం కలగడానికి వీర్యం పలచగా ఉందా చిక్కగా ఉందా అనేది ప్రధానం కాదు. వీర్యంలో వీర్య కణాలు లేకపోతే గర్భం రాదు. వీర్యంలో వీర్యకణాలు లేకపోవడమనేది వీర్యం పలచగా ఉన్నా జరుగుతుంది. చిక్కగా ఉన్నా జరుగుతుంది. వీర్యం చిక్కగా తయారవడానికి ఎటువంటి మందులు వాడనవసరం లేదు.

అంగ పరిమాణం- సెక్స్‌ తృప్తి
స్త్రీకి సెక్స్‌లో తగిన తృప్తి కలగాలంటే అంగపరిమాణం పెద్దదిగా ఉండాలనే అభిప్రాయం ఎందరిలోనో ఉంది. స్త్రీకి రతిలో తృప్తి కలగడానికి అంగ పరిమాణానికి సంబంధం లేదు. అందరి పురుషుల అంగ పరిమాణం దాదాపు ఒకటే విధంగా ఉంటుంది. మామూలు సమయంలో రెండు నుంచి నాలుగు అంగుళాలు ఉంటుంది. అయితే అంగం స్తంభించినప్పుడు దాదాపు అందరిది ఒకటే పరిమాణం ఉంటుంది.
కొన్ని కారణాల వల్ల కొందరిలో అంగ పరిమాణం తక్కిన వారికంటే చాలా చిన్నదిగా ఉన్నా సెక్స్‌ తృప్తి కలగడంలో స్త్రీలో ఎటువంటి తేడా రాదు. స్త్రీకి సెక్స్‌లో తృప్తి కలగడానికి అంగ పరిమాణం ఎంత ఉందనేది ప్రధానం కాదు. స్త్రీకి సెక్స్‌లో సుఖప్రాప్తి కలిగేవరకు అంగస్తంభన ఉండటం, రతిని కొనసాగించటం ప్రధానం.
స్త్రీకి కామనాడులు యోనిలో ఒకటిన్నర అంగుళం వరకే ఉంటాయి. అంతకంటే లోపలికి కామనాడులు ఉండవు. కామనాడులు అన్నీ యోని ద్వారం దగ్గర క్లైటోరిస్‌లోనే ఉంటాయి. అందుకని సైంటిఫిక్‌గా చెప్పాలంటే స్త్రీకి రతిలో తృప్తి కలగాలంటే స్తంభించిన పురుషాంగం మూడు అంగుళాలు ఉంటే చాలు. కావల్సిందల్లా అంగస్తంభనం చక్కగా ఉండటం, నిముషాలలోనే సుఖప్రాప్తిని పొందితే మరికొంత స్త్రీలు సుఖప్రాప్తి పొందడానికి అయిదు పది నిముషాలు తీసుకుంటారు. స్త్రీలల్లో సుఖప్రాప్తి కలగడం అనేది వారికి కలిగే లైంగిక ఉద్దీపనల బట్టి, వ్యక్తుల బట్టి, పరిస్థితుల బట్టి ఉంటుంది.

హ ర్మోన్ల లోపం- అంగ పరిమాణం
కొందరిలో హ ర్మోన్ల లోపం ఉండి యుక్త వయస్సు వచ్చినా అంగ పరిమాణం పెరగకుండా చిన్నపిల్లలలోలాగ సన్నదిగా చిన్నదిగా ఉంటుంది. ఇటువంటి వారిలో సెక్స్‌ కోరికలు కలగడం కాని, అంగస్తంభన కాని ఉండదు. ఎప్పుడో కప్పుడు యాంత్రికంగా కొంత అంగం గట్టిపడుతూ ఉండొచ్చు. కాని హ ర్మోను లోపంవల్ల అలా అప్పుడప్పుడు యాంత్రికంగా కలిగే అంగస్తంభనలు ఏమాత్రం పనికిరావు. ఉపలైంగిక లక్షణాలైన చంకలోనూ, మర్మావయాల దగ్గర వెంట్రుకలు, ఉండి వృషణాలపరిమాణం వయసు ప్రకారంగా ఉన్నట్లైతే అంగస్తంభనలు కూడా మామూలుగా ఉంటాయి. అంగ స్తంభనలు మామూలుగా ఉండి హస్త ప్రయోగం అలవాటు ఉండి సెక్స్‌ కోరికలు మామూలుగా ఉంటే అంగ పరిమాణం గురించి దిగులు చెందడం అనవసరం. అంగ పరిమాణాన్ని పెంచడానికి ప్రత్యేకంగా మందులు లేవు. మామూలుగా అందరికి 2-4 అంగుళాలు లోపు అంగ పరిమాణం ఉంటుంది. హ ర్మోన్ల లోపం ఉండి పురుషాంగం చిన్న ప్లిలలాగ ఉంటే తగిన హ ర్మోన్ల ఇంజక్షన్‌ ఇచ్చి అంగ పరిమాణం పెంచవచ్చు.

హస్త ప్రయోగం- అంగ పరిమాణం
కొందరిలో హస్త ప్రయోగం గురించి అర్థంలేని భయం ఉంటుంది. హస్త ప్రయోగం చేస్తే అంగం చిన్నదైపోతుందని భయపడతారు. ఆ భయం వారిలో భ్రాంతి మనస్తత్వాన్ని పెంపొందిస్తుంది. భ్రాంతి మనస్తత్వం వల్ల అంగ పరిమాణం తగ్గకపోయినా తగ్గినట్లు ఫీలవుతారు. వారి కంటికి అలాగే కనబడుతుంది. దానికి కారణం హస్త ప్రయోగం గురించి ఉన్న భయం, ఆందోళనే కారణం. హస్త ప్రయోగం వల్ల ఎటువంటి నష్టం జరగదనే విజ్ఞానాన్ని వారికి కలిగిస్తే వారిలో భయం తొలగిపోతుంది. భ్రాంతి మనస్తత్వం కూడా లేకుండా అవుతుంది. ఆ పైన సెక్స్‌లో చక్కగా పాల్గొనగలుగుతారు.
 బ్రహ్మచర్యం- ఆయుష్షు
వీర్యం నష్టం కలగకుండా సెక్స్‌లో పాల్గొనకుండా బిగుతుగా లంగోట కట్టేసి బ్రహ్మచర్యం పాటిస్తే ఆయుర్దాయం పెరుగుతుందని అనుకుంటారు. బ్రహ్మచర్యం ఏ విధంగాను ఆయుష్షుని, ఆరోగ్యాన్ని పెంచదు. నపుంసకులుతప్ప అస్ఖలిత బ్రహ్మచార్యులంటూ ఎవరూ ఉండరు. వీర్యం తెలిసో తెలియకుండానో ఎప్పుడో ఒకప్పుడు పోతూనే ఉంటుంది. వీర్యం ఏ మాత్రం విలువైంది కాదు. వీర్యం ఎంత పోయినా నష్టం కాదు.

వ్రేలాడే బీర్జాలు
బీర్జకోశంలో బీర్జాలు ఇటొకటి అటొకటి ఉంటాయి. బీర్జకోశం ముడుచుకొని అయినా ఉండవచ్చు, సాగైనా ఉండవచ్చు. బీజకోశం ముడుచుకునే ఉండాలని అలా ఉండకపోతే ఏదో ఒక లోపం ఉందని అనుకుంటే పొరబాటే. బీర్జకోశం సాగి ఉన్నప్పుడు అందులోని బీర్జాలు కొమ్మకి మామిడికాయలు వ్రేలాడినట్టుగా క్రిందికి వ్రేలాడుతూ కనబడతాయి. ఇలా బీర్జకోశంలోని వృషణాలు వ్రేలాడటం ఎటువంటి వీక్‌నెస్‌ కాదు. అవి ఏ విధంగానైన ఉండవచ్చు. సాధారణంగా బీర్జాలకి వేడి ఎక్కువైనప్పుడు బీర్జకోశం సాగి గాలి పోసుకుని బిర్జాలని చల్లబరుస్తాయి. శరీరం లోపలి భాగాలకంటే బీర్జాలకి రెండు-మూడు డిగ్రీలు సెంటీగ్రేడ్‌ హీట్‌ తక్కువ ఉండాలి. అందుకోసమని బీర్జాలు హీట్‌గా ఉన్నప్పుడు బీర్జకోశం సాగి బీర్జాలకి చల్లదనాన్ని కలిగిస్తుంది. ఈ విషయం తెలియక తమలో ఏదో నరాల బలహీనత ఉందని, బీర్జాలు సాగిపోయాయని దిగులు చెందుతారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top