వయసు 19. ఐదేళ్లుగా నా క్లాస్‌మేట్‌ని ప్రేమిస్తు న్నాను. మూడువారాల క్రితమే మాకు నిశ్చితార్థం కూడా జరిగింది. అప్పటినుంచి అతను శారీరకంగా దగ్గరవుదామంటూ ఒత్తిడి చేస్తున్నాడు. ఈ రోజుల్లో అందరూ ఇలాగే చేస్తున్నారంటున్నాడు. సహకరించక పోతే నిశ్చితార్థం రద్దు చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. నేనేం చేయను?
అతని తొందరపాటు తప్పే. ఈ తరం మీద పాశ్చాత్య ప్రభావం తాలూకు నీడలే ఈ కొత్త పద్ధతులన్నీ. మన సంస్కృతి అనే కాదు... ఇతరత్రా కూడా పెళ్లికి ముందు అలా తొందరపడడం మంచిది కాదు. ఎంత నిశ్చితార్థం అయినా సరే. పెద్దల అంగీకారం లేని ఆ కలయిక భయంతో, హడావుడిగా, ఏ మాత్రం మధురా నుభూతుల్ని మిగల్చకుండా జరుగుతుంది. ఐదేళ్ల పరి చయాన్ని ప్రేమగా, పరిణయంగా మార్చుకుంటున్న మీరు ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టి పెళ్లయ్యాకే ఆ బంధానికి శ్రీకారం చుడితే అందమూ... గౌరవప్రదమూ. అందుకని అతనికి నచ్చజెప్పండి. అయినా అతను నిశ్చితార్థం రద్దు చేస్తానంటూ మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉంటే మాత్రం... మీరు ఆలోచించాల్సిందే. నిశ్చితార్థానికి ముందు కూడా ఇలా ఎప్పుడైనా బలవంతం చేసాడా? అతనిలో ఏం చూసి మీరు ప్రేమిం చారు?అతను మిమ్మల్ని ఇష్టపడటానికి కారణాలేమి టి? ప్రేమించిన వ్యక్తిని ఇలా బ్లాక్ మెయిల్ చేసే మనిషి ని పెళ్లిచేసుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇవన్నీ ఆలోచించుకోండి. అతడిని పిలిచి సీరియస్‌గానే మీ అభిప్రాయం చెప్పండి. అతను మీ అభిప్రాయాన్ని మన్నించి పెళ్లయ్యేవరకు ఓపికపడితే మంచిదే. లేదం టాడా... మీరు మరింత కచ్చితంగా ఉండాల్సిందే. పెద్దలకు విషయం చెప్పండి. వాళ్ల ముందు మీకు అవమానంగా ఉంటుందనో, నిశ్చితార్థం జరిగాక పెళ్లి రద్ద యితే అప్రతిష్ఠ అనో ఆలోచించకుండా నిర్మొహమా టంగా అమ్మానాన్నలతో విషయం చెప్పండి. పోనీలే కాబోయే భర్తే కదా అని మీరు రాజీపడితే మాత్రం ఇబ్బంది పడాల్సింది మీరే. బంధం బలపడడానికి కావ లసింది ప్రేమ, నమ్మకం కానీ భయం కాదు. మీనైతిక విలువలను విస్మరించకండి.