కొందరు స్త్రీలు మర్మావయవాల దగ్గర రోమాలని తరచూ తొలగించుకోవాలని తెలియక అలాగే వుంచేసుకుంటారు. లేదా అశ్రద్ధతో చాలాకాలం అలాగే వుంచేసుకుంటారు. ఇలా బాగా పెరిగిన రోమాలు సెక్స్‌లో పాల్గొన్నప్పుడు అంగప్రవేశంతో యోని మార్గంలోకి దూరు తాయి. పురుషాంగం కదలికతో వెంట్రుకలు రుద్దుకుపోయి యోనిమార్గం పుండుగా మారు తుంది. దానితో సంయోగం బాధాకరంగా మారుతుంది.అందుకని ప్రతి స్త్రీ 10-15 రోజులకి ఒకసారి వెంట్రుకలని తొలగించుకోవాలి. మర్మావయవాల దగ్గర వెంట్రుకలు పెరగడంవల్ల సంయోగం బాధాకరంగా మారడమే కాకుండా అక్కడ చెమట ఎక్కువపట్టి చీముపొక్కులు, తామర, గజ్జివంటి వ్యాధులు రావడం జరుగుతుంది. అందుకని 'సెక్స్‌హైజిన్' చాలా ముఖ్యం.- గర్భనిరోధానికి కొందరు కొన్నిరకాల బిళ్ళలు యోనిలో ప్రవేశపెట్టుకుంటారు. ఈ బిళ్ళలు రసాయనిక గుణం కలిగి వుండడం వల్ల యోనిమార్గం పుండుగా మారి సంయోగంలో బాధ కలుగుతుంది. గర్భనిరోధానికి వెజైనల్ టాబ్లెట్లు వాడేవారు, వాటిని వాడిన తరువాత సెక్స్‌లో నొప్పి అనిపిస్తే వాటివల్లేనని గమనించాలి.
కొందరు స్త్రీలు యోనిమార్గం శుభ్రత కోసం డెట్టాల్, పొటాషియం పెర్మాంగనేట్ నీళ్ళతో వాష్ చేసుకుంటారు. కొందరికి ఈ కెమికల్స్ పడక యోని పుండుగా మారి సంయోగంలో నొప్పి కలుగుతుంది.ఇటువంటి స్త్రీలు తాము శుభ్రత పాటిస్తున్నాం కదా, ఈ నొప్పి ఎందుకని ఆలోచనలో పడిపోతారు. శుభ్రతకోసం పాటించే ఆ పద్ధతే నొప్పికి కారణమని తెలుసుకోరు.
స్త్రీలలో కొందరికి గర్భాశయం కంఠానికి పూత, పుండువంటివి వస్తాయి. వీటివల్ల ఇతర బాక్టీరియా క్రిములు చేరి గర్భాశయ, దాని పక్కన వుండే ఇతర లిగమెంట్లు వాచి సంయోగంలో నొప్పికి కారణమవుతాయి. గర్భాశయం పక్కనే ఓవరీస్, అండవాహికలు వుంటాయి. రకరకాల వ్యాధులవల్ల ఇవి వాచడం, చీముపట్టడం, జరుగుతుంది. ఇవే కాకుండా గర్భసంచిని పట్టివుంచే ఇతర లిగమెంట్లు వాచి, వాటి దగ్గరే చీముగడ్డలు తయారవుతాయి. ఇలా పొత్తి కడుపులో గడ్డలు, వాపు తయారైనప్పుడు సంయోగంలో నొప్పి అనిపిస్తుంది.
శుభ్రమైన పద్ధతిలో కాన్పులు చేయనప్పుడు, అక్రమ పద్ధతిలో గర్భస్రావం చేయించు కున్నప్పుడు, మామూలుగానే గర్భస్రావమైనా పూర్తిగా అవనప్పుడు, సుఖవ్యాధులు వచ్చి నప్పుడు, గర్భాశయం ట్యూబులు, ఓవరీస్ వాయడం, చీముగడ్డలు తయారవడం జరుగు తుంది. వీరిలో కొందరికి సంయోగంలో స్ట్రోక్స్ గట్టిగా లేనప్పుడు బాధ అనిపించదు. సంయోగం తరువాత నొప్పి బయటపడి గంటలకొద్దీ బాధపెడుతుంది.
ఇటువంటి పరిస్థితి వున్నవారికీ గర్భాశయం, ట్యూబులు, ఓవరీస్, లిగమెంట్లవాపు వుండడమో, చీము గడ్డలు వుండడమో కారణం. పి.వి. చేసినా, ఆల్ట్రాసైండ్ స్కానింగ్ చేసినా, వాపు, చీముగడ్డల విషయం తెలుస్తుంది. కొందరికి ఈ పరిస్థితి మందులతో చక్కబడితే మరికొందరికి ఆపరేషను అవసరమవుతుంది.
- ఎక్కువమంది స్త్రీలలో సాధారణంగా సంయోగ సమయంలో బాధ కలిగించేవ్యాధులు- ట్రైకోమోనియాసిస్, మొనిలియాసిస్. వీటివల్ల యోనిమార్గం పూసినట్లయి సంయోగంలో బాధపుట్టిస్తాయి.
- గనేరియా వున్నప్పుడు కూడా యోనిమార్గం పుండుగా మారి సంయోగంలో మంట, నొప్పి కలిగిస్తాయి.
- కొందరికి పురుషాంగం ప్రవేశిస్తూ వుంటేనే బాధ వుంటుంది. వీరికి యోని దగ్గరచీరుకుపోయినా, చీముగడ్డలు తయారైనా, పుండ్లుపడినా సంయోగం బాధాకరంగా వుంటుంది.
కొందరికి కాన్పులో కుట్లుపడతాయి. ఆ కుట్లు పూర్తిగా మానవు. చీముపట్టి పచ్చిగానే వుండిపోతాయి. ఇటువంటివారికి సంయోగంలో నొప్పి అనిపిస్తే తగిన యాంటిబయాటిక్స్ వాడి చికిత్స పొందితే గాయం మాని మామూలు అవుతుంది.
- యోనిద్వారం పక్కనే బార్థోలిన్ గ్రంథులు వుంటాయి. కొందరికి ఈ బార్థోలిన్ గ్రంథులు ఉబ్బుతాయి. ముఖ్యంగా గనేరియా వ్యాధివున్న స్త్రీలలో బార్థోలిన్ గ్రంథి వాచడం సహజం. ఈ గ్లాండు వాపువల్ల సంయోగంలో పాల్గొనాలంటే బాధ అనిపిస్తుంది. ఆపరేషన్ చేసి చీముని తీసివేయడం, గనేరియాకి మందు వాడడం చేస్తే నొప్పి పోతుంది.
కొందరికి యోని పెదవుల మీద చీముపొక్కులు వాస్తాయి. వాటివల్ల కూడా సంయో గంలో నొప్పి కలుగుతుంది. షాంకరాయిడ్, హెర్పిస్ సింప్లెక్స్ పుళ్ళు రావడం వల్ల సంయో గంలో బాధ వుంటుంది. అందుకని పరీక్ష చేయించుకుని వ్యాధిని బట్టి చికిత్స పొందాలి.