అంగం పొడవుని పెంచే సర్జరీలేమైనా ఉన్నాయా?

Suka Samsaram
0
నా వయసు 23 ఏళ్లు. నా అంగం అవసరానికంటే పొట్టిగా ఉందేమోననే అనుమానం నన్ను చాలా కాలంగా వేధిస్తోంది. అంగం ఎంత పొడవుండాలి? పొడవుని పెంచే సర్జరీలేమైనా ఉన్నాయా?
 
సాధారణంగా చాలా మందికి అంగ పరిమాణం గురించి ఎన్నో అపోహలుంటాయి. పొడవు పెంచే వార్తలు, ప్రకటనలను టి.వీల్లో, పేపర్లలో చూసి వాటికి ఆకర్షితులవుతూ ఉంటారు. కానీ అలా చేస్తామని చెప్పే పరికరాలు, నూనెలు నకిలీవి. అవి ఏ రకంగానూ అంగ పరిమాణాన్ని పెంచలేవు. ఎవరికైనా అంగం స్తంభించినప్పుడు, దాని పొడవు కనీసం 3 అంగుళాలు ఉంటే, అంగ పరిమాణంలో ఎటువంటి లోపం లేదని అర్థం చేసుకోవాలి. అంతకుముందువరకూ మామూలుగా ఉన్న అంగం హఠాత్తుగా పొడవు తగ్గితే, అందుకు కారణం హార్మోన్ల లోపం కావచ్చు. అలాంటప్పుడు వైద్యులను కలిసి చికిత్స తీసుకోవచ్చు. పెళ్లైన తర్వాత అంగ పరిమాణం గురించి దంపతుల మధ్య గొడవలు జరిగినప్పుడే వైద్యులు అంగ పరిమాణాన్ని పెంచే సర్జరీ చేస్తారు. అంతేతప్ప పెళ్లికి ముందు ఇలాంటి సర్జరీలను వైద్యులు ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించరు. అలాగే సర్జరీతో అంగం కేవలం ఒక అంగుళం మాత్రమే పెరుగుతుంది. స్తంభించినప్పుడు 3 అంగుళాలకు తగ్గకుండా ఉండి, భాగస్వామికి సంతృప్తి కలిగిస్తుంటే, అంగ పరిమాణం గురించి అనుమాన పడవలసిన అవసరం లేదు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top