జనాభాలో సుమారు 10 శాతం దంపతులు సంతానం కలగక బాధపడుతూ వుంటారు. ప్రపంచ జనాభాలో 80 మిలియన్ల దంపతులు సంతానం కలగని వారని ఒక అంచనా. సంతానం కలగనప్పుడు దంపతులిద్దరూ డాక్టరుకి చూపించుకున్నప్పుడు ఎవరిలో లోపం వున్నదీ వెంటనే తెలుస్తుంది. దాని బట్టి రెండవవారికి వైద్య పరీక్షలు అనవసరంగా జరపడం వుండదు. దీని వల్ల ధనం, సమయం రెండూ కలసివస్తాయి.స్త్రీకి 20-30 సంవత్సరాల వయసులో గర్భం వస్తుంది. ఆపైన గర్భం రావడం తక్కువ. సాధారణంగా పురుషునిలో ఇటువంటి పరిస్థితి కనబడదు. పురుషుడు ఏ వయస్సులో పాల్గొన్నా అతనివల్ల గర్భం మామూలుగానే వస్తుంది.
రతిలో ఎక్కువసార్లు పాల్గొనేవారిలో గర్భం త్వరగా వస్తుంది. తక్కువ పాల్గొనేవారిలో గర్భం రావడం ఆలస్యం అవుతుంది. వారానికి ఒకసారే రతిలో పాల్గొంటే ఆరునెలల్లో గర్భం వచ్చేవారు 1-2 సార్లు రతిలో పాల్గొనే దంపతులలో 6 నెలలలోగా గర్భం దాల్చేవారు 32 శాతం మంది వుంటారు. వారానికి 2-3 సార్లు పాల్గొనే దంపతులలో 6 నెలలలోగా 46 శాతం మంది గర్భం దాల్చుతారు. వారానికి 3-4 సార్లు పాల్గొనే దంపతులలో 51 శాతం మంది ఆరునెలల్లో గర్భం దాల్చుతారు. వారానికి 4 సార్లు కంటే మించి రతిలో పాల్గొనే దంపతులు 83 శాతం మంది 6 నెలల్లో సంతాన సాఫల్యత పొందుతారు.
వంధ్యత్వ సమస్య ఎక్కువకాలం వున్నవారు సంతాన సాఫల్యత పొందడం ఆలస్యం అవుతుంది. అందుకని వంధ్యత్వం వున్నవారు ముందుగానే పరీక్షలు చేయించుకోవడం అవసరం.