గర్భం రావడానికి పురుషుడు రెగ్యులర్‌గా దాంపత్యంలో పాల్గొనాలి. తరచు గనేరియా వంటి సుఖవ్యాధులకి గురి అవుతున్నా, మూత్రసంబంధిత వ్యాధులు వస్తున్నా గర్భం రాదు. వృషణాలకి దెబ్బతగలడం, ఇన్‌ఫెక్షన్ రావడం వాపు ఉన్నట్లయితే వీర్యకణాల ఉత్పత్తి దెబ్బతినే అవకాశం వుంది.దిగని వృషణాలు, కలగని సంతానం
కొందరు పురుషులలో వృషణాలు బీజకోశంలో కాకుండా, పొత్తికడుపు దగ్గరవుంటాయి. మరికొందరిలో వృషణాలు చింతపిక్కలంత చిన్నవిగా వుంటాయి. ఇటువంటి వారు సెక్స్‌లో సమర్థవంతంగా పాల్గొనగలుగుతారు కానీ, సంతాన సాఫల్యత వుండదు. కొందరు పురుషులకి మూత్రద్వారం పురుషాంగం చివర్లో కాకుండా మొదట్లో వుంటుంది. ఇటువంటి వారికి మూత్రం, వీర్యం అక్కడ నుంచే వుంటుంది.వీరిలో అంగప్రవేశం ఇబ్బందిలేకపోయినా మూత్రద్వారం పురుషాంగం మొదట్లోనే వుండబట్టి వీర్యమంతా యోని బయటే పడిపోతుంది.
సంతానం కలగనప్పుడు పురుషుని వీర్యం ఒక్కటే పరీక్షచేస్తే చాలదు. పురుషాంగం, వృషణాలు ఎలా వున్నవీ నిశితంగా పరీక్షించాలి. అలాగే వీర్యంలో వీర్యకణాలు ఎన్ని వున్నవీ, ఎలా వున్నవీ చూడాలి.
మద్యం, మత్తు పదార్థం తెచ్చే ముప్పు
కొందరు పురుషులకు మద్యం, మత్తు పదార్థాలు, స్మోకింగ్ అలవాట్లు వుంటాయి.ఇవికూడా వీర్య కణాల ఉత్పత్తిని దెబ్బతీస్తాయి. దానివల్ల సంతానం కలగకుండా పోతుంది. పురుషులలో వీర్యకణాల ఉత్పత్తి లేనప్పుడుగానీ, తక్కువగా వున్నప్పుడుగానీ కొందరిలో కొన్ని రకాల హ ర్మోన్ల లోపం కూడా వుంటుంది. అటువంటి లోపం వుందని అనుమానం కలిగినప్పుడు పరీక్షలు జరిపి ఆ లోపాన్ని సరిదిద్దితే చాలావరకు ఫలితం వుంటుంది. అవ సరం బట్టి తగిన మోతాదులో, తగిన కోర్సుగా టెస్టోస్టిరోన్, గొనాడోట్రాఫిన్ ఇంజెక్షన్లు వాడవలసి వుంటాయి.
వీర్యకణాల ఉత్పత్తికి తోడ్పడే హ ర్మోన్ల ఇంజెక్షన్లు
వీర్యంలో వీర్యకణాలు తక్కువగా వున్నప్పుడు హ్యూమన్ కోరియానిక్ గొనాడో ట్రాఫిన్ 2000 .ఏ. ఇంజెక్షన్లు వారానికి రెండు చొప్పున 3 నుంచి 6 నెలలు వాడవలసి వుంటాయి. లేదా హ్యూమన్ మెనోపాజల్ గొనాడో ట్రాఫిన్|.ఏ. 75 వారానికి 3 ఇంజెక్షన్లు చొప్పున 3 నుంచి 6 నెలలు వాడవలసి వుంటుంది. సాధారణంగా 75 శాతం మందిలో వీర్యకణాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇలా పెరిగిన వారిలో సగం మందికి సంతాన సాఫల్యత కలుగుతుంది. అయితే అవసరం బట్టి కొందరికి గొనాడో ట్రాఫిన్ రిలీజింగ్ హ ర్మోను ఇంజెక్షన్లు వాడవలసి వస్తాయి.అరుదుగా కొందరు పురుషులలో తమ వీర్యకణాలకే యాంటీబాడీస్ తయారై వీర్య కణాలని దెబ్బతీస్తాయి. స్పెరమ్ యాంటిబాడి టైటర్‌ద్వారా దాన్ని గుర్తించి ప్రెడ్నిసొలోన్‌టాబ్లెట్లని కోర్సుగా కొంతకాలం ఇచ్చి చికిత్స చేయవలసి వుంటుంది.వృషణాలు మామూలు పరిమాణంలోనే వుండి వీర్యంలో వీర్యకణాలు లేనప్పుడు లేదా బాగా తక్కువగా వున్నప్పుడు టెస్టిక్యులర్ బయాప్సి తీసి చికిత్స చేయడం అవసరం.