స్త్రీలు వాడే కండోమ్ గురించి వివరించగలరు. ?

Suka Samsaram
0
నా బాయ్ ఫ్రెండ్ ఇప్పటి వరకు కండోమ్ వాడే వాడు. అయితే అది వాడటం విసుగ్గా ఉందని, ఆనందించ లేకపోతు న్నానని అంటున్నాడు. అది వాడడం మానేస్తే గర్భమే కాదు... సుఖ వ్యాధుల్లాంటి ఇతరత్రా సమస్యలూ వస్తాయని నా భయం. ఆ మధ్య స్త్రీల కండోమ్ గురించి చదివాను. వాటి గురించి తెలియజేస్తారా ?

ఫిమేల్‌ కండోమ్ ఎప్పటి నుంచే తయారు చేస్తున్నారు. పురుషులు వాడే కండోమ్ తో పాటు డయాఫ్రమ్‌ ప్రయోజనాలు కూడా దీనికి ఉన్నాయి. 17 సెం.మీ. పోడుగున్న పాలీయురేథీన్‌ బ్యాగులా ఉండే ఈ కండోమ్ కు  రెండు చివర్లా రెండు రింగ్స్‌ లాంటివి

ఉంటాయి. ఒకటి లోపలికి చొప్పించడాని  వీలుగా ఉంటే రెండోది పైన ఉండి కండోమ్ మొత్తం జారిపోకుండా ఉండేటట్లు చూస్తుంది. సిలికాన్‌ లూబ్రికెంట్‌తో పూత ఉంటుంది. పురుషుల కండోమ్ లాగే ఈ ఫిమేల్‌ కండోమ్ కూడా బాగా పనిచేస్తుంది. ఇవి కాకుండా ఇతరత్రా గర్బనిరోధక సాదనలున్నాయి. కానీ మీరన్నట్లు సుఖ వ్యాధులు సోకకుండా ఉండాలంటే కండోమ్ వాడి తీరాల్సిందే. అందుకు మీ బాయ్‌ ఒప్పుకోవడం లేదని మీర రాజీ పడకూడదు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top