మగవాళ్ళని ఆశ్చర్యపరిచేది, ఆసక్తిని కలిగించేది అనుమానాలు, అపోహలతో తల్లడిల్లిపోయేటట్లు చేసేది పురుషాంగం. పురుషాంగం నిర్మాణం గురించి అవగాహన వుంటే అర్థంలేని అనుమానాలు, అపోహలు, భయాలు ఉండవు.పురుషాంగం మామూలు సమయంలో రెండు నుంచి నాలుగు అంగుళాల పరిమాణం ఉంటుంది. స్తంభించినపుడు నాలుగు నుంచి ఆరు అంగుళాలు ఉంటుంది. నాలుగు అంగుళాల పరిమాణం వున్న పురుషాంగం సెక్స్‌లో స్త్రీకి ఎంత చక్కని రుచులను చూపిస్తుందో రెండు అంగుళాల పరిమాణం వుండే పురుషాంగం కూడా స్తంభించగా అంతగానే శృంగారంలో థ్రిల్‌ని ప్రసాదిస్తుంది. ఇది తెలియక చాలామంది యువకులు తమ అంగ పరిమాణం చిన్నదని తల్లడిల్లిపోతూ ఉంటారు. పురుషాంగం మామూలు సమయంలో చిన్నదిగా, సన్నదిగా, మెత్తగా వుండి స్తంభించినపుడు పెద్దదిగా, లావుగా, గట్టిగా మార్పు చెందడానికి దాని నిర్మాణమే మూలంపురుషాంగ నిర్మాణం :
పురుషాంగంలో స్పాంజి వంటి కండరాలు ఉంటాయి. ఇవి ఇలాస్టిక్ గుణాన్ని కలిగి ఉంటాయి. పురుషాంగంలో రక్తనాళాలు, నరాలు పుష్కలంగా ఉంటాయి. పురుషాంగంలో మామూలు మాంసపు కండరాలు ఉండవు. ఎముక కూడా ఉండదు.పురుషాంగంలో కాండము, శిశ్నము అనేవి ప్రధానంగా ఉంటాయి. కాండంనే షాఫ్ట్ అంటారు. కాండం రెండు నుంచి నాలుగు అంగుళాల పొడవు ఉంటుంది. పురుషాంగం చివరి భాగంలో, స్ట్రాబెర్రీ ఫ్రూట్ ఆకారంలో శిశ్నం ఉంటుంది. దీన్నే గ్లాన్స్ అంటారు. శిశ్నంలో కామనాడులు అధికంగా ఉంటాయి.
పురుషాంగం కాండంలో సిగరెట్ షేపులో మూడు స్పాంజి కండరాలు ఉంటాయి. క్రిందివైపు ఒక కండరం ఉంటుంది. దాన్ని కార్పస్ స్పాంజియోజం అంటారు. దీని చివరి భాగమే శిశ్నంగా రూపొందుతుంది. కార్పస్ స్పాంజియోజంపైన సిలిండ్రికల్ షేప్‌లో రెండు మెత్తని కండరాలు ఉంటాయి. ఈ రెండు కండరాలని కార్పస్ కేవర్నోజం అంటారు. ఈ మూడు కండరాలకి సంబంధించిన మొదళ్ళు రివర్స్ 'వి'షేప్‌లో వున్న ప్యూబిక్ బోన్స్‌కి అంటుకుని ఉంటాయి.
ఈ మూడు కండరాల లోపల పల్చని గోడలతో అనేక ఖాళీ గదులు ఉంటాయి. గాలి ఊదకుండా రబ్బరు బూరలన్నీ వరసైన కుప్పగా పడేస్తే ఎలా ఉంటుందో అలా ఈ మూడు కండరాలు మెత్తవిగా, చిన్నవిగా, సన్నగా ఉంటాయి. బూరలన్నింటిలోకి గాలి ఊదితే వరుసైన దొంతరగా తయారైనట్లుగానే ఈ మెత్తని కండరాలలోకి రక్తం చేరితే అవన్నీ బాగా ఉబ్బడం, సాగడం జరిగి పురుషాంగం పెద్దదిగా కనబడుతుంది

పురుషాంగ పూర్మచర్మం :
ఈ మూడు కండరాలని ఒక క్రమపద్ధతిలో వుంచేందుకు ఒక ఫైబ్రస్ లేయర్ వాటిని చుట్టి ఉంచుతుంది. పురుషాంగం కండరాలు సాగే గుణం వున్నట్లుగానే ఈ ఫైబ్రస్‌పొర కూడా సాగేగుణాన్ని కలిగి ఉంది. పురుషాంగం కాండంపైన చర్మం తాజాగా, ముడతలుగా అంటుకుని ఉంటుంది. శిశ్నంపైన చర్మం అంటుకుని వుండకుండా ఒక ముసుగులాగా ఉంటుంది. ఆ ముసుగునే ఫోర్‌స్కిన్ లేదా ప్రెప్టూజ్ అంటారు. దీన్నే పురుషాంగం పూర్వ చర్మం అంటారు. పురుషాంగం పూర్వచర్మాన్ని వెనక్కిలాగితే శిశ్నం వెనక్కి, పూర్తిగా వెళ్ళిపోతుంది. పురుషాంగం కాండంపైన వున్న చర్మం లూజుగా, ముడతలుగా వున్నప్పటికీ అది మాత్రం వెనక్కి వెళ్ళదు. అంగం స్తంభించినప్పుడు తేలికగా ఉబ్బడానికి, సాగడానికి అక్కడి చర్మం తోడ్పడుతుంది
సెక్స్‌లో మధురానుభూతులు ఎలా కలుగుతాయి ? :
శృంగారంలో మధురమైన అనుభూతులు శిశ్నంలోనే కలుగుతాయి. శిశ్నంలో కామనాడులు ఫుల్‌గా ఉంటాయి. నొప్పి, వేడి, చల్లన తెలిపే కామనాడులు వేరువేరుగా వున్నట్లుగానే సెక్స్‌పరమైన థ్రిల్‌ని కలిగించే నాడులు కూడా వేరుగా ఉంటాయి. ఈ కామనాడులు శరీరంలో అన్ని
ప్రాంతాలలోను వున్నప్పటికీ పురుషాంగంలో, శిశ్నంలో అత్యధికంగా ఉంటాయి. శిశ్నంలో కూడా ఫ్రెన్సులమ్ దగ్గర, కరోనా రిట్జ్‌లోను అధికంగా ఉంటాయి. ఈ కామనాడులు చేతితో ప్రేరణ కలిగించినా, నోటితో ప్రేరణ కలిగించినా లేదా సెక్స్‌లో పాల్గొన్నా చక్కని ప్రేరణ పొంది మధురమైన అనుభూతులని కలిగిస్తాయి.

సెక్స్ హైజిన్ చాలా ముఖ్యం :
శిశ్నం దిగువభాగంలో చుట్టూ గుంట లాగా ఉంటుంది. దీన్నే కరోనా సల్కస్ అంటారు. శిశ్నం దిగువభాగాన్ని కరోనా రిట్జ్ అంటారు. ఈ కరోనా రిట్జ్ విూద కొన్ని వందలు, వేలు చిన్నచిన్న గ్రంథులు ఉంటాయి. సూదిమొనంత పరిమాణం లో ఉంటాయి. వీటి నుంచి జిగురుగా ద్రవాలు ఊరి శిశ్నం ఎండిపోకుండా చేస్తాయి. వీటి నుంచే పాచి పదార్థం కూడా తయారువు తుంది. రోజు స్నానం చేసేటప్పుడు పురుషాంగం పూర్వ చర్మాన్ని పూర్తిగా వెనక్కి లాగి సబ్బుతో రుద్ది నీళ్ళతో వాష్ చేయాలి. అలా శుభ్రత పాటించకపోతే పురుషాంగం పూర్వచర్మం క్రింద పాచి పేరుకునిపోయి దుర్గంధం కలుగుతుంది. సెక్స్ హైజిన్ పాటించని వాళ్ళల్లో ఇన్‌ఫెక్షన్లు కలగడమే కాకుండా పురుషాంగం కాన్సరు కలిగే అవకాశం ఉంది. సెక్స్ హైజిన్ లేని పురుషుడు వల్ల స్త్రీకి కూడా సర్వైకల్ కాన్సరు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యరీత్యా పురుషాంగం శుభ్రత అత్యంత అవసరం.
మామూలు సమయంలో పురుషాంగం కేవలం మాత్ర విసర్జనకి ఒక ట్యూబు వంటిది. అయితే సెక్స్ విషయంలో ప్రధానంగా రెండు విధులని నిర్వర్తిస్తుంది. అందులో మొదటిది అంగం స్తంభించడం, రెండవది వీర్యస్ఖలనం అవడం.
మామూలు సమయంలో పురుషాంగం కేవలం మాత్ర విసర్జనకి ఒక ట్యూబు వంటిది. అయితే సెక్స్ విషయంలో ప్రధానంగా రెండు విధులని నిర్వర్తిస్తుంది. అందులో మొదటిది అంగం స్తంభించడం, రెండవది వీర్యస్ఖలనం అవడం.
అంగస్తంభనలు ఎలా కలుగుతాయి ? :
అంగం స్తంభించడాన్ని ఇరెక్షన్ అంటారు. అంగం స్తంభించడం అటనోమస్ నర్వెస్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. అంగం స్తంభించడమనేది పురుషాంగం దగ్గరజరిగే ప్రేరణవల్ల కావచ్చు లేదా మెదడులో కలిగే భావప్రకంపనల వల్లకావచ్చు. అందమైన స్త్రీని చూడటం వల్లనో, సెక్సీవాయిస్ వినడం వల్లనో, స్పర్శవల్లనో, మనస్సులో మెదిలే ఫాంటసీ భావాల వల్లనో జరగవచ్చు. ఈ విధంగా స్తంభించడానికి మెదడులోని సెక్స్‌సెంటర్స్ నుండి నాడీ సంకేతాలు పురుషాంగంలోని రక్తనాళాలకు చేరతాయి. ఆ నాడీ సంకేతాలతో పురుషాంగంలోకి రక్తనాళాలు బాగా వ్యాకోచిస్తాయి. వ్యాకోచించే రక్తనాళాల ద్వారా పురుషాంగంలోని ఖాళీ గదుల్లోకి రక్తం దూసుకుపోతుంది. దాంతో పురుషాంగం పెద్దదిగా ఉబ్బిపోతుంది. పురుషాంగం ఉబ్బిపోవడంతో అందులోని సిరలు నొక్కుకుపోయి రక్తం బయటకుపోకుండా ఉండిపోతుంది. ఈ విధంగా అంగం స్తంభిస్తుంది. కొందరిలో పురుషాంగాన్ని ప్రేరేపించకుండానే అంగస్తంభనలు కలుగుతాయి. ఇటువంటివారిలో బాహ్యప్రేరణ ఏదీ లేకుండా కేవలం ఫాంటసీ ఆలోచనలే మెదడులో సెక్స్ కేంద్రాలు ఉత్తేజితమయ్యేటట్లు చేస్తాయి. దాంతో అంగం స్తంభిస్తుంది.
చిన్న పిల్లల్లో అంగస్తంభనలకి కారణం ఏమిటి ? :
చంటిపిల్లల్లోను, కాస్త వయస్సు వచ్చిన పిల్లల్లోను అంగం స్తంభించడం ఉంటుంది. వీళ్ళల్లో మూత్రనాళం మూత్రంతో నిండిపోవడంతో అంగం స్తంభించే నరాలు యాక్షన్‌లోకి వచ్చి అంగం గట్టిపడేటట్లు చేస్తాయి. పెద్దవాళ్ళల్లో కూడా నిద్రలో లేదా తెల్లవారు ఝామున సమయాలలో అంగం స్తంభించడానికి మూత్రంతో మూత్రకోశం నిండిపోవడమే కారణం. కొందరిలో నిద్రలో అంగం స్తంభించడానికి సెక్స్‌పరమైన కలలు రావడమే కారణం. అంగస్తంభనలో శారీరక ప్రేరణే కాకుండా సైకలాజికల్ ప్రేరణ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకనే అంగస్తంభన విషయంలో మనస్సు ప్రాధాన్యం చాలా ఉంది. నరాల ప్రేరణతో అంగం స్తంభించగా కొద్దిసేపటికి ఆ ప్రేరణ ఆగిపోతే అంగం తిరిగి మెత్తబడిపోతుంది. అంగం స్తంభించడంలో ఫిజియోలాజికల్ రోల్ ఎంత ఉందో సైకలాజికల్ రోల్ కూడా అంతగానే ఉంది. సైకలాజికల్‌గా భయంగానీ, కంగారుగానీ, దిగులుగానీ కలిగితే నాడీ సంకేతాలు ఆగిపోతాయి. అంగం మెత్త బడిపోతుంది. అంగస్తంభనలో నరాల ప్రాధాన్యత ఎంత ఉన్నదో వీర్యస్ఖలనం విషయంలో కూడా ఎంతో మెకానిజం ఉంది. పెల్విస్ దగ్గర వుండే కండరాలు, నరాలు యాక్షన్ గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది.