నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా. ఆమె కూడా నన్ను ప్రేమిస్తోంది. ఆమెది విశాఖపట్నం, బీఎస్సీ చదువుతోంది. నేను కర్నూలులో ఎంకాం చేస్తున్నాను. ఒక రాంగ్ నంబర్ ద్వారా మాకు పరి చయమైంది. ఆ పరిచయం స్నేహమై, చివరకు ప్రేమగా మారింది. మా ప్రేమ చాలా గొప్పది. మేమిద్దరం ఇప్పటివరకూ ఒకరినొకరం చూసుకోలేదు. కాని ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం.ఆమె నాకు దక్కదేమోనని రెండుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశాను. ఆ విషయం తెలిసి తనూ ఆత్మహత్యాయత్నం చేసింది. వచ్చేనెలలో
ఆమెను చూడటానికి వైజాగ్ వెళ్తున్నాను. కాని నా స్నేహితులు మా ప్రేమ నిజం
కాదంటున్నారు. ఒకరి నొకరు చూసుకోకుండా లవ్ ఏమిటంటున్నారు. ఆమె టైమ్పాస్
కోసం కాల్ చేస్తోందని చెప్తున్నారు. తనకు నామీద నిజంగానే ప్రేమ ఉందా?
ఇటువంటి ప్రేమలు నిజమవుతాయా? మా ప్రేమ ఫలిస్తుందా?కమ్యునికేషన్స్ పెరిగిన ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ ద్వారా మీరు ఫ్రెండ్స్ గా మారడాన్ని అర్థం చేసుకోగలను. ఒకరినొకరు చూసుకోకపోయినా మీరు స్నేహంగా ఉండడానికి, ప్రేమించుకోవడాన్నీ అర్థం చేసుకోగలను. ఎందు కంటే ప్రేమకు అతి ముఖ్యమైంది కమ్యూనికేషన్. అది చాలాకాలంగా మీ మధ్య ఉంది. అయితే మీ ప్రేమ నిజమైనదేనా అంటే సమాధానం చెప్ప లేను. మొబైల్ ఫోన్లు వచ్చాక ఎవరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో తెలుసుకోవడం కష్టమవుతోంది. మీరు ఆమె ల్యాండ్ నంబర్ అడగండి, లేదా ఆమెను ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేయమనండి. ఆమెది ఏ ఊరో తెలిసిపోతుంది. ఆమెది వైజాగే అయితే వీలైనంత త్వరగా ఆమెను కలవండి. అమె ఎవరో, ఆమె మనసేమిటో మీకే తెలుస్తుంది. నిజంగా ఆమె మిమ్మల్ని ప్రేమిస్తుంటే మీ ప్రేమ గొప్పదే. లేదా మీ ఫ్రెండ్స్ చెప్పి నట్లు టైమ్పాస్ చేస్తుంటే, అది బాధాకరమే. అలా జరక్కూడదనే ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్.