జాగ్రత్తలు - నివారణా పద్దతులు
మనిషి చూడటానికి బాగున్నంత మాత్రాన వారికి ఎలాంటి సుఖవ్యాధులూ లేనట్లు కాదు. చాలామందికి సుఖవ్యాధి ఉన్నా అసలా విషయం వారికి తెలియకపోవచ్చు కూడా. కొందరిలో పైకి ఎలాంటి లక్షణాలూ లేకుండా కూడా సుఖవ్యాధులు ఉండొచ్చు. కొందరిలో లక్షణాలున్నా కూడా వాటిని మూత్రనాళ ఇన్ఫెక్షన్లుగా, ఏదో ఫంగల్ ఇన్ఫెక్షన్లుగా పొరబడే అవకాశమూ ఉంటుంది. కాబట్టి కొత్త వారితో లైంగిక సంపర్కం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఏరకమైన అనుమానం ఉన్నా అరమరికలు, దాపరికాలు లేకుండా భాగస్వామితో మాట్లాడటం, సంభోగానికి ముందు సురక్షిత విధానాల చర్చించటం మంచిది. 'మనకు ఇలాంటి సమస్యలు రావులే' అన్న లేనిపోని భరోసా పెట్టుకోవద్దు. సుఖవ్యాధులు ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. మీరు ప్రతిసారీ ఒక్క భాగస్వామితోనే సంభోగంలో పాల్గొంటుండొచ్చుగానీ.. ఆ భాగస్వామికి ఇతరులతో సంబంధాలు లేవన్న భరోసా కష్టం. కాబట్టి ఎవరితోనైనా తగు జాగ్రత్తలు ముఖ్యం. యోని సంభోగమే కానవసరం లేదు.. మలద్వార సంభోగం, అంగచూషణం వంటివి కూడా సుఖవ్యాధులు సంక్రమించటానికి మార్గాలే!
సుఖవ్యాధులకు సంబంధించి ఏ కొంచెం అనుమానంగా ఉన్నా ప్రామాణికమైన చికిత్స అందించే వైద్యులకు చూపించుకుని, పరీక్షలు చేయించుకోవటం మంచిది. అంతేగానీ నాటువైద్యుల వంటివారిని ఆశ్రయించటం మంచిది కాదు.
కండోమ్ వాడకం చాలా విధాలుగా శ్రేయస్కరం. కానీ ప్రపంచవ్యాప్తంగా సుఖవ్యాధుల నివారణ విషయంలో కండోమ్‌ల ప్రాధాన్యాన్ని చాలామంది గుర్తించటం లేదని అధ్యయనాలు ఘోషిస్తున్నాయి. చాలామంది కండోమ్‌లను కేవలం గర్భనిరోధక సాధనాలుగానే గుర్తిస్తున్నారు. సుఖవ్యాధుల నివారణ విషయంలో వీటికి ఉన్న ప్రాధాన్యం చాలా ఎక్కువ. వీటితో గనోరియా, క్లమీడియా, ట్రైకోమొనియాసిస్ వంటి చాలా రకాల సుఖవ్యాధులను నివారించుకోవచ్చు. ప్రతిసారీ, సక్రమంగా వాడుతుంటే కండోమ్‌లతో 98% వరకూ సుఖవ్యాధులను నివారించుకోవచ్చు. ప్రతిసారీ కండోమ్ వాడుతున్నాం కదా అనుకుంటూ ఒక్కసారి దాన్ని నిర్లక్ష్యం చేసినా సుఖవ్యాధి సంక్రమించొచ్చు. కాబట్టి ప్రతిసారీ సురక్షితచర్యలు తీసుకోవటం ముఖ్యమని తెలుసుకోవాలి.
జననాంగాల మీద పండ్లు, రసి, దద్దు, స్రావాల వంటి అసహజ లక్షణాలున్న వారితో సంభోగానికి దూరంగా ఉండటం మంచిది. కొత్తవారితో సంభోగానికి దూరంగా ఉండటం అవసరం. ఎందుకంటే గనోరియా వంటి వ్యాధులున్నా కూడా మహిళల్లో పైకి ఎలాంటి లక్షణాలూ కనబడకపోవచ్చు. అలాగే పురుషుల్లో కూడా చాలా సుఖవ్యాధుల లక్షణాలు కనబడకపోవచ్చు. కానీ వారి నుంచి సంక్రమించే అవకాశాలు ఉంటాయి.
సుఖవ్యాధి ఏదైనా ఉందని గుర్తించిన తర్వాత.. అది పూర్తిగా తగ్గే వరకూ వైద్యుల సలహా లేకుండా సంభోగంలో పాల్గొన వద్దు. భాగస్వాములిద్దరూ వైద్యులను సంప్రదించటం అవసరం. సుఖవ్యాధులకు చికిత్స సూచిస్తే ఆ చికిత్స పూర్తయిన తర్వాత మళ్లీ వైద్యులను కలిసి, పూర్తిగా నయమైందని నిర్ధారించుకోవటం ముఖ్యం.
ఎదిగే పిల్లలకు సురక్షిత శృంగార పద్ధతుల గురించి, ప్రయోగాలు చేస్తే పొంచి ఉండే ప్రమాదాల గురించి తెలియజెప్పటం చాలా అవసరం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సుఖవ్యాధుల వ్యాప్తి యుక్తవయుసు వారిలోనే చాలా ఎక్కువగా కనబడుతోంది.
హెపటైటిస్-బి, హెపీవీ వంటివి సంక్రమించకుండా ఇప్పుడు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. వైద్యుల సలహా మేరకు వీటిని పిల్లలకు, యుక్తవయస్కులకు ఇప్పించటం అన్ని విధాలా శ్రేయస్కరం.
ఒక్కసారికే సుఖవ్యాధులు వస్తాయా?
చాలామంది కుర్రవాళ్ళకి వేశ్యల దగ్గరకి వెళ్లితే సుఖవ్యాధులు సంక్రమిస్తాయి. తెలుసు. అయితే వేశ్యలతో పలుమార్లు కలిస్తేనే సుఖవ్యాధులు వస్తాయని ఒకటి-రెండుసార్లకి రావని అనుకుంటారు. కాని అది అపోహ మత్రమే. సుఖవ్యాధులు ఉన్నవాళ్లతో సెక్స్‌లో పాల్గొంటే ఒక్కసారికే వ్యాధి రావటం జరుగుతుంది. అదే విధంగా వేశ్యతో ఒక్కసారి పాల్గొంటే సుఖవ్యాధులు రావనుకోవడం, ఎవరితోనైనా తాము సెక్స్‌లో పాల్గొంటే ఒకటి- రెండు సార్లకే వాళ్ళకి సుఖవ్యాధులు సంక్రమించవని అనుకోవడం ఉంటుంది. కాని ఇవన్నీ అర్థంలేని అభిప్రాయాలే.
నిరోధ్‌తో సెక్స్ - సెక్స్ వ్యాధులకి ఆటకట్టు
సుఖవ్యాధులు ఉన్న పురుషుడు పురుషాంగానికి నిరోధ్ వాడి సెక్స్‌లో పాల్గొంటే అతనికున్న సుఖవ్యాధులు అంత తేలికగా రెండవవారికి సంక్రమించటం ఉండదు. అలాగే సుఖవ్యాధులు ఉన్న స్త్రీతో నిరోధ్ వాడి సెక్స్‌లో పాల్గొంటే ఆమె నుంచి మగవానికి సుఖ వ్యాధులు సంక్రమించడం బహు అరుదు.
కొంతమంది పురుషులు పెళ్లినాటికే తమలో ఉన్న సుఖవ్యాధులు గురించి ఏ మాత్రం శ్రద్ధ తీసుకోకుండా సెక్స్‌లో పాల్గొనటం జరుగుతుంది. అలా పాల్గొనటం వల్ల అమాయకులైన అమ్మాయిలని మోసం చేయటం అవుతుంది.
సుఖవ్యాధులు ఉన్నప్పుడు పూర్తిగా తగ్గే వరకు సెక్స్‌లో పాల్గొనకుండా ఉండటమో లేదా జాగ్రత్తగా నిరోధ్ వాడటమో చేయాలి. లేనిపక్షంలో గనేరియా, సిఫిలిస్, షాంకరాయిడ్స్, యల్.జి.వి. గ్రాన్యులోమా ఇంగ్వైనాలె, హెర్పిస్ ప్రోజెనిటాలిస్, ఎయిడ్స్ వంటి వ్యాధులు రెండవ వారికి సంక్రమించడం వారి బ్రతుకులు అన్యాయం అవటం జరుగుతుంది.
మూత్రం మంట
కొందరికి మూత్రం మంటగా వస్తుంది. మూత్రనాళం దగ్గర జిల వుంటుంది. జిగురుగా కొంత ద్రవం రావడం కూడా వుండవచ్చు. ఇవన్నీ వస్తే సెగవ్యాధి (గనేరియా) అనిపిస్తుంది. కానీ పరీక్ష చేస్తే గనేరియా వ్యాధి క్రిములు కనబడవు. గనేరియాకి వాడే మందులు వాడితే వ్యాధి తగ్గడం జరగదు. వారాలు తరబడి బాధలు వుంటాయి.
ఇటువంటి వ్యాధిని 'నాన్ గోనోకోకల్ యురిథ్రయిటిస్, లేదా 'నాన్‌స్ఫెసిఫెకల్ యూరోజెనిటల్ ఇన్‌ఫెక్షన్' అంటారు. మామూలుగా చెప్పుకోవాలంటే గనేరియా కాని గనేరియా లేదా 'సెగవ్యాధి కాని సెగవ్యాధి' అని చెప్పుకోవచ్చు.
సెగవ్యాధి కాని సెగవ్యాధి వున్న 10 శాతం మందిలో ఇతర వ్యాధులకి సంబంధించిన క్రిములు కనబడతాయి. 90 శాతం కేసుల్లో ఏ వ్యాధి క్రిమీ కనబడదు. కానీ బాధ మిగిలి వుంటుంది. మూత్రం వచ్చేటప్పుడు మంట, నొప్పి అనిపిస్తూనే వుంటాయి. ఎంతకీ ఏ కారణమూ తేలదు.కారణం కనబడే 10 శాతం కేసుల్లో మూత్రపిండాలు, మూత్రకోశం వ్యాధులు కారణం కాగా, ఏదో ఒక కారణం వల్ల మూత్రనాళం సన్నబడడం, ట్రైకోమోనాస్ ఇన్‌ఫెక్షను వుండటం, బ్యాక్టీరియల్, ఫంగల్, వైరస్ ఇన్‌ఫెక్షన్ వుండడం మరికొంత కారణం. ఇన్ని రసాయనిక పదార్ధాలకి గురికావడం, మూత్రనాళానికి గాయం అవడం కూడా కారణమే. కాని 'సెగవ్యాధి కాని సెగవ్యాధి' లో 90 శాతం కేసుల్లో ఏ కారణమూ కనబడదు.
సెగవ్యాధి దుష్ఫరిణామాలు

- 'సెగవ్యాధి కాని సెగవ్యాధి' వున్న కొందరిలో ప్రోస్టేటు గ్రంథి వాస్తుంది. మర్మావయవాల దిగువన నడుము నొప్పి, మూత్రం మంట, తరచు మూత్రం రావడం వుంటాయి.
- కొందరు పురుషులలో శుక్రకోశాలు వాస్తాయి. పొత్తి కడుపు దగ్గర నొప్పి అనిపిస్తుంది. వీర్యం విడుదలైనప్పుడు మంట అనిపించడం, అప్పుడప్పుడు వీర్యంతో రక్తం రావడం జరుగుతాయి. కొందరిలో వృషణాలపైన వుండే ఎపిడిడిమిస్ వాస్తుంది. దానివల్ల కొంత సలపరం అనిపిస్తుంది.
- 'సెగవ్యాధి కాని సెగవ్యాధి' లో మూత్రనాళం సన్నబడడం చాలా తక్కువ. అదే గనేరియా వ్యాధిలో చికిత్స జరగకపోతే మూత్రనాళం సన్నబడడం కొందరిలో కనబడుతుంది.
'సెగవ్యాధి కాని సెగవ్యాధి' స్త్రీలలో వుంటుంది. మామూలుగా బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ వల్ల మూత్రకోశ వ్యాధులు రావడం ఎక్కువ. కాని ఏ కారణం కనబడకుండా మూత్రం మంటతో బాధపడడం ఎందరిలోనో కనబడుతుంది. ముఖ్యంగా లైంగిక సంపర్కం తరువాత బాధలు ఎక్కువ అవడం సాధారణంగా జరుగుతుంది. ఇలా స్త్రీలలో బాధలు రావడానికి కొంత పురుషునికి ఇన్‌ఫెక్షన్ వుండడం కారణంకాగా, లైంగిక సంబంధంలో మూత్రనాళం ఒరుసుకుపోవడం, గాయమవడం మరొక కారణం.
స్త్రీలలోని 'సెగవ్యాధి కాని సెగవ్యాధి' వున్నప్పుడు ట్రైకోమోనియాసిస్, మొనలియాసిస్ వుండడం ఒక ప్రధాన కారణం. అలాగే జననేంద్రియాలకి సంబంధించిన ఇతర వ్యాధులు వుండడం, గర్భాశయం ప్రక్కనే ఇన్‌ఫెక్షన్ వుండడం కారణం. స్త్రీల విషయంలో పూర్తి వైద్య పరీక్షలు అవసరం. అంతేగాని మూత్రం మంట అనిపిస్తే గనేరియా అనుకోవడం తప్పు.
'సెగవ్యాధి కాని సెగవ్యాధి' వున్నప్పుడు దిగులు చెందనవసరంలేదు. అధిక సంఖ్యాకుల్లో కొద్దివారాల్లో దానంత కదే తగ్గిపోతుంది. కొద్దిమందికే బాధ మిగిలి వుంటుంది. ఇటువంటి వారు 'సైనోమైసిన్-100' క్యాప్స్యూల్స్ గాని 'సిఫ్రాన్-500' బిళ్లలుగాని ఉదయం-ఒకటి, రాత్రి-ఒకటి చొప్పున 15 రోజులు వాడాలి.'ఫ్లాజిల్-400' బిళ్లలు ఉదయం-ఒకటి, మధ్యాహ్నం-ఒకటి, రాత్రి-ఒకటి చొప్పున వారం రోజులు వాడాలి. మంచినీళ్లు ఎక్కువ త్రాగడం అలవాటు చేసుకోవాలి. మద్యం తీసుకునే అలవాటు వున్నవారు బాధలు తగ్గిపోయేవరకు మద్యం తీసుకోకూడదు.
అంగం మీద పుండు
వేశ్యా సంపర్కం పొందిన పది నుంచి వంద రోజుల్లో సిఫిలిస్ వ్యాధి బయట పడుతుంది. ఈ వ్యాధి ట్రిపొనోమా పాలిడం అనే క్రిమివల్ల వస్తుంది. పురుషులలో సిఫిలిస్ పుండు స్పష్టంగా పురుషాంగం మీద ఏర్పడగా స్త్రీలలో యోనిలోపల ఏర్పడవచ్చు. యోని బయట పుండు లేనంత మాత్రాన వ్యాధి కలగనట్లు కాదు.
సిఫిలిస్ పుండు మొదట్లో కందిగింజంత అవుతుంది. రసి అంటుకుని పక్కన కూడా పుండు పడే అవకాశం వుంది. కొందరిలో మర్మావయవాలమీద పుండు పడడమే కాకుండా గజ్జల్లో కూడా గడ్డగా తయారవుతుంది.
పెన్సిలిన్ ఇతరత్రా అనేక యాంటిబయాటిక్స్ ఆవిర్భావంతో సిఫిలిస్ వ్యాధి మొదటి దశలోనే పూర్తిగా నిర్మూలింపబడుతోంది. అందువల్ల వ్యాధిక్రానిక్ అయి రెండవదశ, మూడవ దశ లక్షణాలని కలుగజేయడం అరుదైపోయింది.
సిఫిలిస్ వ్యాధి కోసమో, మరొకందుకో యాంటిబయాటిక్ మందులు వాడటంతో ఆ యాంటిబయాటిక్ మందులు ఇతర వ్యాధిక్రిములతోపాటు సిఫిలిస్ వ్యాధిక్రిములను కూడా నిర్మూలిస్తున్నాయి. ఆ రకంగా సిఫిలిస్ వ్యాధి రెండవ దశ, మూడవ దశ ఏర్పడటం పూర్వంకంటే తక్కువైంది.
సిఫిలిస్ వ్యాధి రెండవ దశ
సిఫిలిస్ వ్యాధిక్రిములు మొదటి దశలో నిర్మూలింపబడనప్పుడు వ్యాధివచ్చిన నెల ఉంచి మూడు నెలలలో సిఫిలిస్ వ్యాధి రెండవ దశ లక్షణాలు ఏర్పడతాయి. రెండవదశ కలిగిన వారిలో ఒంటిమీద రాష్ వస్తుంది. కొద్దిపాటిగా జ్వరం వుంటుంది. శరీరంలో వివిధ చోట్ల లింఫ్‌గ్లాండు ఉబ్బుతాయి. నోటిలోపల పుళ్ళు పడతాయి. ఈ లక్షణాలు ఇతర వ్యాధుల్లో కూడా ఉంటాయి.
సిఫిలిస్ వ్యాధి మూడవ దశ
సిఫిలిస్ మూడవ దశ కలిగిన మూడు నుంచి పది సంవత్సరాల తరువాత ఎప్పుడైనాబయటపడవచ్చు. సిఫిలిస్ మూడవ దశలో ఈ వ్యాధి వల్ల మెదడు, గుండె, వెన్నుపాము,టెస్టికల్స్, ఎముకలు, శరీరంలోని ఇతర భాగాలు దెబ్బతింటాయి. సిఫిలిస్ మూడవదశ కలగడం యిప్పుడు బాగా తగ్గిపోయింది.

సిఫిలిస్ వ్యాధికి సరిగ్గా చికిత్స పొందకపోతే ఆ క్రిములు చాలాకాలం శరీరంలో వుంటాయి. సిఫిలిస్ వ్యాధి వున్న స్త్రీకి గర్భం వస్తే ఈ క్రిములు తల్లి రక్తంద్వారా బిడ్డకు చేరుతాయి. గర్భస్థ శిశువుకు తల్లినుండి సంక్రమించినప్పుడు బిడ్డ అంగవైకల్యంతో పుట్టవచ్చు. లేదా నెలలు నిండకుండానే అబార్షను అవవచ్చు. కొందరు పిల్లలు నెలలు నిండే పుడతారు. అయితే పుట్టుకతోనే ప్రాణాలు పోయి పుడతారు.ఒకవేళ ప్రాణం పోకపోయినా చర్మం అనారోగ్యంగా వుంటుంది. శరీరంలో వివిధ చోట్ల లింఫ్‌గ్రంథులు వాచి వుంటాయి. ఇటువంటి పరిస్థితినే కంజెనిటల్ సిఫిలిస్ అంటారు. ఒకవేళ తల్లికి సిఫిలిస్ వుంటే గర్భం దాల్చిన రెండు-మూడు నెలల్లోనే పెనిడ్యూర్ యల్.ఎ. 24 ఇంజక్షన్ చేయించుకుంటే బిడ్డకు ఈ వ్యాధివల్ల హని కలగదు.
కొందరు సిఫిలిస్ పుండు పడగానే వి.డి.ఆర్.యల్. రక్తపరీక్ష చేయించుకుని తమకి పడిన పుండు సిఫిలిస్ కాదని ఊరుకుంటారు. కాని సిఫిలిస్ మొదటి దశలో వి.డి.ఆర్.యల్. రక్తపరీక్షలో దోషం కనపడేవరకు ఆగకూడదు.
సిఫిలిస్ వ్యాధికి చికిత్స
సిఫిలిస్ వ్యాధి మొదటిదశలో వున్నప్పుడు పెనిడ్యూర్ యల్.ఎ. 24 ఒక ఇంజెక్షన్ చేయించుకుంటే చాలు. వ్యాధి తగ్గిపోతుంది. పెన్సిలిన్ పడని వాళ్లు డాక్సీసైక్లిన్‌గానీ, సైనో మైసిన్- 100 క్యాప్యూల్స్ ఉదయం-1, రాత్రి-1 చొప్పున 15 రోజులు వాడాలి. లేదాట్రాసైక్లిన్-500 గాని, 'ఎరిథ్రోమైసిన్-500' ఆరుగంటలకి ఒకటి చొప్పున 15 రోజులు వాడాలి. సిఫిలిస్ రెండవ దశ, మూడవ దశలో పెనిడ్యూర్ యల్.ఎ.24 ఇంజెక్షన్ వారానికి ఒకటి చొప్పున నాలుగు వారాలు వాడాలి. సిఫిలిస్ కాకుండా ఇతర పుళ్లు కూడా మర్మావ యవాల మీద పడతాయి. వీటిని గుర్తించి చికిత్స పొందాలి.
షాంకరాయిడ్ పుళ్ళు
షాంకరాయిడ్ వ్యాధి కూడా లైంగిక వ్యాధే. ప్రధానంగా వేశ్యాసంపర్కం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ఉన్న స్త్రీతో పురుషుడు కలిసినా, పురుషునితో స్త్రీ కలిసినా వ్యాధి సంక్రమిస్తుంది.
ఈ వ్యాధి గనేరియా, సిఫిలిస్ అంత ఎక్కువ కాకపోయినా ఎక్కువమందిలో కనబడు తుంది. ఈ వ్యాధి డుక్రీ బాసిలస్ వల్ల వస్తుంది. లైంగిక సంపర్కం కలిగిన 1 నుంచి 5 రోజుల్లో వ్యాధి బయటపడుతుంది. షాంకరాయిడ్ వ్యాధిలో రెండుకంటే మించి పుళ్లు మర్మావయవాలమీద ఏర్పడతాయి. ఈ పుళ్లు చాలా నొప్పి అనిపిస్తాయి. సిఫిలిస్ వ్యాధిలో సాధారణంగా ఒకటే పుండు పడుతుంది. పురుషులలో పురుషాంగం పూర్వచర్మం క్రింద,ఫ్రెన్యులమ్ దగ్గర, శిశ్నం వెనుక గాడిలోను, మూత్రం వచ్చే రంధ్రం దగ్గర పుళ్లు పడతాయి.స్త్రీలో యోని పెదవులమీద, యోని లోపల మూత్రద్వారం దగ్గర పుళ్లు ఏర్పడతాయి. స్త్రీలలో యోని పెదవులమీద, యోని లోపల మూత్రద్వారం దగ్గర పుళ్లు పడతాయి.
షాంకరాయిడ్ పుండు ఒక చిన్న నీటి బుడగలాగా లేచి ఆ తరువాత చీము ఎక్కువగా చేరి పగులుతుంది. పుండు ఎర్రగా వుంటుంది. ఏమాత్రం రుద్దుకున్నా పుండునుంచి రక్తం కారుతుంది. నొప్పి అనిపిస్తుంది. షాంకరాయిడ్ పుండు రసి అంటుకున్న చోటల్లా మరో పుండు పుడుతుంది. ఈ రసి అంటుకోవడం వల్ల గజ్జల్లో, తొడలమీద పుళ్ళు పడి సలపరం కలిగిస్తాయి.షాంకరాయిడ్ పుండు పడినవారిలో కొద్దిపాటి జ్వరం వుంటుంది. ఒళ్ళునొప్పులు వస్తాయి. తలనొప్పి వుంటుంది.
షాంకరాయిడ్‌లో బాధలు
షాంకరాయిడ్ వ్యాధి వచ్చినప్పుడు ఇతర బాక్టీరియా క్రిములు కూడా తోడవుతాయి. దాంతో బాధ మరింత ఎక్కువ అవుతుంది. పురుషాంగ పూర్వచర్మం కింద పుళ్ళు పడినప్పుడు చర్మం వాస్తుంది. దానితో శిశ్నం మీద చర్మం మూసుకుపోతుంది. వెనుకకి కదలకుండా అవుతుంది. చర్మం బాగా వాచిపోయి ఎంతో బాధ కలుగుతుంది. మూత్రం విసర్జించాలన్నా ఎంతో బాధ అనిపిస్తుంది. షాంకరాయిడ్ వచ్చినవారిలో ఎందరిలోనో, గజ్జల్లో బాధాకరమైన చీము గడ్డ తయారవుతుంది. మొదట్లో ఈ గడ్డ గట్టిగా, నొప్పిగా వుంటుంది. కొద్ది దినాల్లో ఇది పెద్దదై మెత్తగా తయారై పగులుతుంది. అందులో నుంచి చీము వస్తుంది. గజ్జల్లో ఏర్పడే ఈ గడ్డని 'బ్యూబో' అంటారు.
షాంకరాయిడ్ వ్యాధి వచ్చినప్పుడు శిశ్నం, పురుషాంగ పూర్వచర్మం రెండూ పుండుగా మారతాయి. పురుషాంగ పూర్వచర్మం బిగుసుకు పోయినప్పుడు దానినుంచి దుర్వాసన కలిగించే ద్రవం స్రవిస్తుంది.
స్త్రీలలో షాంకరాయిడ్
స్త్రీలలో ఈ పుండ్లు పడినప్పుడు యోని పెదవులు వాచిపోతాయి. ఎంతో నొప్పి అనిపిస్తుంది. సంయోగంలో పాల్గొనాలంటే నొప్పి అనిపిస్తుంది. గజ్జల్లో బిళ్ల కడుతుంది.
షాంకరాయిడ్ వ్యాధిని పైకి కనబడే వ్యాధి లక్షణాలబట్టి తేలికగా గుర్తించవచ్చు. ఈపుండు రసిని స్లైడుమీద తీసుకుని గ్రామ్‌స్టయిన్ చేస్తే క్రిములు స్పష్టంగా కనపడతాయి.
చాలా సందర్భాలలో షాంకరాయిడ్ సిఫిలిస్, గనేరియా వ్యాధులతో కలిసి వుంటుంది. వేశ్యా సంపర్కం పొందినప్పుడు కాస్త ముందూ వెనుకా రెండు-మూడు రకాల లైంగికవ్యాధులు కలగడం సహజం. వ్యాధులను బట్టి చికిత్స చేయవలసి వుంటుంది.
షాంకరాయిడ్‌కి చికిత్స
షాంకరాయిడ్ వచ్చినప్పుడు కోట్రైమక్సజోల్ బిళ్లలు (బాక్టిరిమ్ డి.ఎస్., సైనాస్టాట్, సెపమాక్స్) ఉదయం-1, రాత్రి-1 చొప్పున వారం రోజులు వాడాలి. లేదా 'ఎరిథ్రో మైసిన్-500' గానీ, 'టెట్రాసైక్లిన్-500' గానీ ప్రతీ ఆరు గంటలకి ఒకటి చొప్పున వారం రోజులు వాడాలి. లేదా స్ట్రెప్టోమైసిన్ 1 గ్రాం. ఇంజెక్షన్ చొప్పున వారం-పది రోజులు క్రమం తప్పకుండా ఇవ్వాలి.
షాంకరాయిడ్ పుండుని పొటాషియం పెర్మాంగనేట్ సొల్యూషన్‌తో శుభ్రంగా కడగాలి. గజ్జల్లో చీముగడ్డ తేలినప్పుడు దానంతటకది పగిలేవరకు ఆగకుండా చీము తీసి డ్రెస్సింగ్ చేయాలి.
షాంకరాయిడ్‌తో సిఫిలిస్ పుండు కూడా రావడానికి ఆస్కారం వుంది కనుక దానినికూడా దృష్టిలో వుంచుకుని సిఫిలిస్ పుండు పడితే దానికి కూడా పూర్తి చికిత్స చేయాలి.

గ్రాన్యులోనూ ఇంగ్వయినాలె
సాధారణంగా సుఖవ్యాధులు అనగానే సిఫిలిస్, గనేరియా,షాంకరాయిడ్ గుర్తు వస్తాయి. ఈ మూడు లైంగిక వ్యాధులు కలగడం కూడా ఎక్కువే. గ్రాన్యులోమా ఇంగ్వయినాలె, లింఫోగ్రాన్యులోమా వెనీరియం (ఎల్.జి.వి.) కూడా లైంగిక వ్యాధులే. అయితే అంతగా ఈ వ్యాధులు కనబడవు.
గ్రాన్యులోమా ఇంగ్వయినాలె వేశ్యా సంపర్కం వల్ల సంక్రమిస్తుంది. లైంగికంగా కలిసిన 1 నుంచి 8 వారాల్లో ఈ వ్యాధి బయటపడింది. డోనోవానియా గ్రాన్యులోమాటీస్ అనే క్రిమి వల్ల ఈ వ్యాధి కలుగుతుంది.
గ్రాన్యులోమా ఇంగ్వయినాలె వ్యాధి కలిగిన పురుషులలో పురుషాంగ పూర్వచర్మం మీద, శిశ్నం మీద చీముపొక్కులాగా పడుతుంది. అది త్వరగా పగిలి ఎర్రటి పుండుగా మారుతుంది. ఈ పుండు గుంటలుగా పడకుండా గింజలాగా గట్టిగా వుంటుంది. స్త్రీలలో బాహ్యధరాల మీద ఇటువంటి పుండే ఏర్పడుతుంది.
గ్రాన్యులోమా ఇంగ్వయినాలె పుండు నుంచి కొంత రక్తం కూడా కారుతుంది. మొదటి చిన్నపుండుగా పడినా, నిదానంగా పెరిగి చాలా పెద్దది అవుతుంది. ఈ పుండు పడినవారిలో గజ్జల్లో గడ్డలు తయారవుతాయి. అవి చీముగడ్డలై పగులుతాయి. అయితే ఈ రోజుల్లో శక్తివంతమైన యాంటీబయాటిక్ మందులుండడంతో మొదట్లోనే వ్యాధి నివారింపబడి దుష్ఫలితాలు వుండడం లేదు.పుండు నుండి రసి గ్లాస్‌స్లైడ్ మీద తీసి పరీక్షచేస్తే వ్యాధిక్రిములు స్పష్టంగా కనబడతాయి. ఆ రకంగా వ్యాధి ఏదైనదీ నిర్ధారణ చేసుకోవచ్చు.
గ్రాన్యులోమా ఇంగ్వయినాలె చికిత్స
గ్రాన్యులోమా ఇంగ్వయినాలె వచ్చినప్పుడు టెట్రాసైక్లిన్-500 మి.గ్రాం. క్యాప్య్సూల్స్ ప్రతీ 6 గంటలకి ఒకటి చొప్పున 10 రోజులు వాడాలి. లేదా 'స్టెప్ట్రోమైసిన్' 1 గ్రాం. ఇంజెక్షన్ ఉదయం-1, రాత్రి-1 చొప్పున 10 రోజులు చేయించుకోవాలి. లేదా 'సైనోమైసిన్-100' క్యాప్స్యూల్స్ ఉదయం-1, రాత్రి-1 చొప్పున 10 రోజులు వాడాలి. పుండుని రోజూ క్లీన్ చేసి పుండుపైన నియోస్పోరిన్ ఆయింట్‌మెంట్ రాయాలి.
సిఫిలిస్‌లోనూ పుండు పడుతుంది. గ్రాన్యులోమా ఇంగ్వయినాలె కూడా పుండు పడుతుంది. అయితే ఈ పుండునుంచి రక్తం రావడం, పెద్దది అవడం జరుగుతుంది. పుండుని పరీక్ష చేయడం ద్వారా ఏ వ్యాధి అయినదీ నిర్థారణ చేయవచ్చు.
లింఫో గ్రాన్యులోమా వెనీరియం :
సుఖవ్యాధుల్లో మరో వ్యాధి లింఫో గ్రాన్యులోమా వెనీరియం. దీనినే ఎల్.జి.వి. అంటారు. ఇది వైరస్ క్రిమివల్ల కలుగుతుంది. ఈ వ్యాధివల్ల ముఖ్యంగా లింఫాటిక్ వ్యవస్థ గురి అవుతుంది.
ఈ వ్యాధి వున్నవారితో లైంగిక సంపర్కం పొందినప్పుడు వారం రోజుల్లో వ్యాధి లక్షణాలు కనబడతాయి. ఈ వ్యాధి ప్రారంభదశలో మర్మావయవాలమీద చిన్న చిన్న నీటి పొక్కులు వస్తాయి. కొద్దిగంటల్లోనే అవి పగిలి కనబడకుండా పోతాయి.
కొందరైతే ఈ పొక్కులు ఏర్పడినట్లే గమనించరు. ఎందరిలోనో ఆ పొక్కులు వచ్చినచోట మచ్చలు కూడా పడవు. అందుకని వ్యాధి వచ్చినట్లే గుర్తించరు. కొద్దిశాతం మందిలోనే పొక్కులు ఏర్పడినచోట పుండు పడుతుంది.
ఎల్.జి.వి. వ్యాధితో నీటి పొక్కులు పడి అదృశ్యమైన 2-3 వారాల్లో గజ్జల్లో గడ్డలు తయారై నొప్పి అనిపిస్తుంది. సాధారణంగా గజ్జల్లో ఒకవైపే గడ్డలు వస్తాయి. ఈ గడ్డలు నిదానంగా పెరిగి సలపరం కలిగిస్తాయి. చీము గడ్డలుగా మారుతాయి. కొందరిలో ఈ గడ్డలు వచ్చినప్పుడు తలనొప్పి, జ్వరం వుంటాయి.
ఈ వ్యాధి వచ్చినప్పుడు మొదట్లోనే మందులు వాడితే తేలికగా తగ్గిపోతుంది. మందులు వాడని కొందరిలో బోదవ్యాధిలో లాగా మర్మావయవాల మీద చర్మం దళసరిగా మారుతుంది. నీరు చేరి ఉబ్బుతుంది. గజ్జల్లో ఏర్పడిన గడ్డలనుండి రసి తీసి పరీక్షచేస్తే వ్యాధి పరిస్థితి తెలుస్తుంది.యల్.జి.వి.
యల్.జి.వి.కి టెట్రాసైక్లిన్-500 క్యాప్స్యూల్స్ ప్రతీ 6 గంటలకి ఒకటి చొప్పున 2 వారాలు వాడాలి. లేదా బాక్ట్రిమ్ డి.ఎస్. సెపమాక్స్ వంటివి ఉదయం-1, రాత్రి-1 చొప్పున 2 వారాలు వాడాలి. వ్యాధి మొండిగా వున్నవారిలో రెండువారాల కంటే మించి వ్యాధి తగ్గేవరకు వాడాలి.
గ్రాన్యులోనూ ఇంగ్వయినాలెగానీ, యల్.జి.వి. గానీ మొదట్లోనే సరిగ్గా చికిత్స పొందకపోతే వ్యాధి పెరిగే అవకాశం వుంది. ఈ వ్యాధి నిదానంగా పెరుగుతుంది. కనుక మందులు వాడుతూ వ్యాధిని తేలికగా అదుపు చేయవచ్చు.
సుఖవ్యాధలు విషయంలో ముఖ్యంగా ఒక విషయం గుర్తు వుంచుకోవాలి. వేశ్యాసంపర్కం పొందిన తరువాత భార్యతో సంయోగంచేస్తే ఆమెకు కూడా మందులు వాడాలి.
హెర్పిస్ సింప్లెక్స్
కొందరు పురుషులకి వేశ్యాసంపర్క పొందిన వారం రోజుల్లో పురుషాంగం పూర్వచర్మం మీద, శిశ్నంమీద చెమట పొక్కులంత పరిమాణంలో నీటి పొక్కులు 10-15 దాకా వస్తాయి. అలా పొక్కులు వచ్చేముందు ఆ స్థలంలో కాస్త నొప్పి, మంట వుంటాయి. దురద కూడా అనిపిస్తుంది. దురదతో ఆ స్థలంలో నలపాలనిస్తుంది. ఆ తరువాత నీటిపొక్కులు వంటివి కొద్దిగంటలలో పగిలి దొండపండులాగా ఎర్రగా పుండు పడుతోంది. ఇటువంటి పరిస్థితి వున్నప్పుడు ఆ పురుషుడు మరో స్త్రీని కలిస్తే ఆమెకు కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
లైంగిక కలయిక ద్వారా సంక్రమించే ఇటువంటి వ్యాధిని హెర్పిస్ జెనిటాలిస్ అనీ, హెర్పిస్ ప్రోజెనిటాలిస్ అనీ, హెర్పిస్ సింప్లెక్స్ అనీ వేరువేరు పేర్లతో పేర్కొంటారు. ఈ వ్యాధి వైరస్ క్రిమివల్ల కలుగుతుంది.
హెర్పిస్ సింప్లెక్స్ లైంగిక కలయిక లేకుండా కూడా రావచ్చు. హెర్పిస్ సింప్లెక్స్‌కి సంబంధించిన పొక్కులు మర్మావయవాలమీదే కాకుండా పెదవుల మీద, దవడల లోపల, నాలుకమీద కూడా వస్తాయి. అక్కడకూడా చిన్న చిన్న పొక్కులు ఏర్పడి పగిలి పుండుగా మారతాయి. ఇలా పడిన పుండ్లు వారం-పది రోజుల్లో తగ్గిపోతాయి. ఈ పుళ్లు పడినప్పుడు నొప్పి అనిపిస్తుంది. నోట్లో పుళ్ళు పడినప్పుడు మర్మావయవాల మీద కూడా పుళ్ళు రావచ్చు.
లైంగిక సంపర్కం ద్వారానో, మరో విధంగానహెర్పిస్ సింప్లెక్స్ వ్యాధివల్ల సాధారణంగా ఎటువంటి హని వుండదు. ఆ పుండ్లు పడినప్పుడు 5-6 రోజులు కాస్త నొప్పి అనిపించడం తప్ప మరేమీ వుండదు. అదీకాక ఈ రోజుల్లో హెర్పిక్స్ (ఎసైక్లోలిరాన్) వంటి ఆయింట్‌మెంట్లు, టాబ్లెట్లు రావడంతో ఆ పుండు కూడా తగ్గిపోతోంది. అయితే ఈ మందు ఈ వ్యాధిని మళ్ళీ రాకుండా పూర్తిగా నిర్మూలించే శక్తి కలిగిలేదు. హెర్పిస్ సింప్లెక్స్ కొందరికి నెలా రెండు నెలలకి తిరిగి కనబడడం వుంటే మరికొందరికి కొన్ని సంవత్సరాలకి ఒకసారి కనబడుతుంది. అలా ఆ వ్యాధి క్రిములు శరీరంలో వున్నా వ్యాధి ముదిరిపోవడం ప్రాణహని కలిగించడం జరగదు. సాధారణంగా చక్కని ఆరోగ్యం వున్నవారికి, మర్మావయవాల దగ్గర పాచి పేరుకొనకుండా రోజూ వాష్ చేసుకుని శుభ్రంగా వుంచుకునేవారికి హెర్పిస్ సింప్లెక్స్ మాటిమాటికి రావడం అరుదు. అందుకని స్నానం చేసినప్పుడు మర్మావయవాలని శుభ్రం చేసుకోవడమే కాకుండా, సెక్స్‌లో పాల్గొనడం అయిపోగానే లేచి సోప్ వాటర్‌తో శుభ్రం చేసుకుంటే హెర్పిస్ సింప్లెక్స్ రావడంగానీ, తిరగబెట్టడం గానీ చాలా తక్కువనే చెప్పాలి.
స్త్రీలలో హెర్పిస్ సింప్లెక్స్
స్త్రీలలో కూడా హెర్పిస్ సింప్లెక్స్ వ్యాధి వుంటుంది. దీనివల్ల వారి యోని పెదవులమీద, యోనిమార్గం లోపల చిన్నచిన్న నీటిపొక్కుల వంటివి రావడం, పగలడం, ఎర్రగా పుండుగా మారడం జరుగుతుంది. ఇటువంటప్పుడు సెక్సులో పాల్గొంటే విపరీతంగా నొప్పి అనిపిస్తుంది. అయితే వారిలో కూడా ఈ బాధలు వారం పదిరోజుల్లో తగ్గిపోతాయి.
స్త్రీలు కూడా శుభ్రతని పాటించడం వ్యాధి కలిగినప్పుడు మందు వాడటం చేస్తే వ్యాధి తేలికగా తగ్గుతుంది. ఈ వ్యాధి వచ్చినా సంతానం కలగడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ వ్యాధి సంతానానికి సంక్రమించటమనేది జరగదు.
హెర్పిస్ సింప్లెక్స్‌కి చికిత్స
హెర్పిస్ సింప్లెక్స్ వ్యాధి లక్షణాలు కనబడినప్పుడు హెర్పిక్స్ (ఎసైక్లోలిరాన్) ఆయింట్ మెంట్ ఆ స్థలంలో రోజుకి 3-4 సార్లు రాయాలి. అలా వారం-పది రోజులు రాయాలి. సాధారణంగా 5-6 రోజుల్లోనే వ్యాధి లక్షణాలు తగ్గిపోతాయి.
వ్యాధి లక్షణాలు మరీ తరచుగావస్తున్నప్పుడు హెర్పిక్స్ టాబ్లెట్లు తడవకి ఒకటి చొప్పున రోజుకి 5 సార్లు వేసుకోవాలి. అలా 10 రోజులు వాడాలి. కొందరికి ఇంకా ఎక్కువ కాలం వాడవలసి వుంటుంది.
మగవాళ్ళకి హెర్పిస్ సింప్లెక్స్ వ్యాధి లక్షణాలు తరచు కనబడుతూ వుంటే సున్తీ చేయించుకోవడం మంచిది. దానివల్ల వ్యాధి నిర్మూలింపబడుతుంది. ఒకవేళ సున్తీ తరువాత కూడా కొద్దిగా చెమటపొక్కులు కనబడినా మందు వాడితే తేలికగా తగ్గిపోతుంది.
నోట్లో కురుపులు కనబడేవారు నోటి శుభ్రతని పాటించడం, పోషకాహరం తీసుకోవడం, శారీరకంగా ఎక్కువగా అలసిపోకుండా వుండడం, మానసికంగా ప్రశాంతంగా వుండడం అలవర్చుకోవాలి.
స్త్రీలలోగానీ, పురుషులలోగానీ మర్మావయవాలమీద పుండు పడితే సుఖవ్యాధే అనే అపోహ ఎందరిలోనో వుంది. శరీరంమీద ఇతర చోట్ల రకరకాల చీము పొక్కులు, చీము గడ్డలు, ఇతర గడ్డలు వచ్చినట్లే మర్మావయవాల దగ్గర కూడా వస్తాయి. అంతే తప్ప మర్మావయవాల మీద వచ్చిన ప్రతి వ్యాధి, ప్రతి పుండు లైంగికవ్యాధి కాదు.
కానీ ఎందరో అక్కడ పుండుపడినా, గడ్డ వచ్చినా చెప్పుకోవడానికి, డాక్టరుకి చూపించు కోవడానికి, సిగ్గుపడి ముదర పెట్టుకుంటారు. దీనికి తోడు ఎప్పుడో వయస్సులో తప్పుచేస్తే వయస్సు మళ్ళిన తరువాత అక్కడ పుండు కనబడితే పూర్వం వచ్చిన వ్యాధే తిరిగి కనబడిందని భావిస్తారు. అపోహే ప్రాణంమీదకి తెస్తుంది. కొందరికి అక్కడా కేన్సరు పుండు ప్రారంభం అవుతుంది. దానిని కేన్సరు అని గుర్తించరు. పూర్వం చేసిన తప్పుకి పరిణామం అనుకుని ఎవరికైనా చెబితే తమ పరువు పోతుందని దాచుకుంటారు. దానితో పుండు ముదిరి ప్రాణంమీదకి తెస్తుంది.
పురుషాంగానికి వచ్చే కేన్సర్‌ని 'కార్సినోమా పెనిస్' అంటారు. చిన్నప్పుడే సున్తీ చేయబడినవారిలో పురుషాంగానికి కేన్సరు రావడం చాలా అరుదు. పురుషాంగం పూర్వచర్మం మూసుకుపోయి వున్నవారిలోనూ, పురుషాంగం శుభ్రతని పాటించనివారిలో పురుషాంగం కేన్సరు రావడం ఎక్కువ కనబడుతుంది. పురుషాంగం పూర్వచర్మం కింద పేరుకునిపోయే పాచి (స్మెగ్మా) కి కేన్సరు కలిగించే గుణం వుంది.
పురుషాంగానికి కేన్సర్ వచ్చినవారిలో గజ్జల్లో గడ్డలు తయారవుతాయి. ఈ గడ్డలు పుండుగా మారడం కాకుండా రాళ్ళలాగా గట్టిగా వుంటాయి. కొందరిలో కేన్సరు కణాలు దూరంగా ప్రయాణించి ఇతరచోట్ల కూడా కేన్సరుని కలిగిస్తాయి. అందుకని ఏవేవో ఊహించుకుని కాలయాపన చేయక కేన్సర్ పరిస్థితిని మొదట్లోనే గుర్తించాలి. పురుషాంగానికి కేన్సర్ 40 సంవత్సరాలు దాటినవారిలో రావడం ఎక్కువ. అయితే 40 సంవత్సరాలలోపు వారిలో కూడా పురుషాంగానికి కేన్సర్ రావచ్చు. పురుషాంగం చర్మం బిగుతు అవడం, దానినుండి దుర్వాసనతో కూడిన ద్రవం రావడం వుంటే వెంటనే డాక్టరుకి చూపించుకోవాలి. కొందరికి ద్రవంతోపాటు రక్తం కూడా కనబడుతుంది. కేన్సర్ పుండుని నిర్లక్ష ్యం చేస్తే మరీ పెద్దదై తినేసినట్లు అవుతుంది. లేదా కంతి తయారవుతుంది. వ్యాధి గురించి అవగాహన వుంటే ఈ పరిస్థితి రాదు. పురుషాంగం మీద కేన్సర్ అనుమానం వస్తే బయాప్సీ తీపి హిస్టోపథిలాజికల్ ఎగ్జామినేషన్ చేస్తే కేన్సర్ అయినదీ కానిదీ నిర్ధారణ అవుతుంది.
కేన్సర్‌కి కీమోథెరపీ, రేడియం ట్రీట్‌మెంట్, సర్జరీ వంటి చికిత్స పద్ధతులు వున్నాయి. వ్యాధి దశనుబట్టి చికిత్సా విధానం ఆధారపడి వుంటుంది.
జననేంద్రియాల మీద ఉలిపిరి కాయలు
కొందరికి పురుషాంగం మీద కోడిపుంజు తలమీద జుట్టులాగా ఉలిపిరికాయలు వస్తాయి. ఇవి మెత్తగా వుంటాయి. నొప్పి వుండదు. వీటినుంచి కొంత రసి తయారౌతుంది. అది అంటుకుని పక్కన మరికొన్ని ఉలిపిరులు తయారౌతాయి. ఈ రకంగా గుత్తులు గుత్తులుగా ఉలిపిరులు తయారౌతాయి.
ఈ ఉలిపిరులని వెనీరియల్ వార్ట్స్ లేదా పాపిలోమా ఎక్సుమినేటా అంటారు. ఇవి కేన్సర్ వ్యాధికి సంబంధించినవి కావు.
వెనీరియల్ వార్ట్స్ సాధారణంగా శిశ్నం వెనుక గాడిలో పెసర, నువ్వుల గింజలాగా తయారై త్వరగా ఒకటికి పది అవుతాయి. ఆ తరువాత శిశ్నంమీద, పురుషాంగం పూర్వచర్మం మీద కూడా వస్తాయి.
కొందరికి వెనీరియల్ వార్ట్స్ గజ్జల్లో, బీజకోశం మీద వస్తాయి. మలద్వారం చుట్టూకూడా ఏర్పడతాయి. వెనీరియల్ వార్ట్స్ లైంగిక సంపర్కం లేకుండా కూడా రావచ్చు. ఇవి రావడానికి ఒకరకమైన వైరస్ క్రిమి కారణం.
వెనీరియల్ వార్ట్స్ స్త్రీ పురుషులిద్దరిలోనూ రావచ్చు. వీటిని నిర్లక్షయం చేస్తే పెద్ద పెద్ద గుత్తులుగా తయారవుతాయి. వెనీరియల్ వార్ట్స్ పోడోఫిల్లిస్ సొల్యూషన్ రాయడం వల్ల చాలా వరకు తొలగించవచ్చు. అయితే ఈ సొల్యూషన్ చాలా జాగ్రత్తగా రాయాలి. లేనిపక్షంలో పుండుగా మారుతుంది.
కాటరైజేషన్ ద్వారా కూడా వీటిని తీసివేయవచ్చు. పోడోఫిల్లిన్ రాసినా, కాటరైజేషన్ చేసినా మళ్ళీ కొత్తవి వచ్చే అవకాశం వుంది. సున్తీ చేసి తొలగించినట్లయితే వెనీరియల్ వార్ట్స్ తిరిగి వచ్చే అవకాశం తక్కువ.

వి.డి.ఆర్.యల్. రక్తపరీక్ష ద్వారా గనేరియా, షాంకరాయిడ్ మొదలగు వ్యాధులు గురించి తెలుసుకోవడం కుదరదు. గనేరియా వ్యాధి ఉన్నదీ లేనిదీ తెలుసుకోవాలంటే మూత్రనాళం నుంచి వచ్చే చీముని గ్లాస్ స్లైడ్‌మీద తీసుకుని లేబరేటరీలో మైక్రోస్కోప్ క్రింద పరీక్ష చేసి చూడాలి. అంతే తప్ప వి.డి.ఆర్.యల్. రక్త పరీక్ష గనేరియా వ్యాధి నిర్థారణకు ఏమాత్రం తోడ్పడదు. అదేవిధంగా షాంకరాయిడ్, తదితర వ్యాధులు విషయంలో కూడా.
పెళ్ళి చేసుకునేముందు ఈ సుఖవ్యాధుల విషయంలో రక్తపరీక్షలు, ఇతర పర్షీలు చేయించుకోవడం, డాక్టర్ చేత కంప్లీట్‌గా ఎగ్జామినేషన్ చేయించుకోవడం, అత్యంత అవసరం. ఆ విధంగా అన్ని విధాల క్లీన్ సర్టిఫికేట్ పొందిన తరువాతే పెళ్ళి చేసుకోవాలి.
ఎయిడ్స్ వ్యాధి ఉన్నట్లు హెచ్.ఐ.వి. టెస్ట్‌లోనూ, వెస్ట్రన్ బ్లాట్ టెస్ట్‌లోనూ తేలినప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండాలి. ఎయిడ్స్ వ్యాధి మొదటి దశలో కొన్ని సంవత్సరాలపాటు ఎటువంటి అనారోగ్యం ఉండకపోవచ్చు. అయినా వివాహం చేసుకోకూడదు. దానివల్ల రెండవ వారు అన్యాయంగా ఈ వ్యాధికి బలైపోతారు. వివాహనికి పూర్వం వేశ్యలతోనూ, అపరిచిత వ్యక్తులతోనూ లైంగిక సంబంధాలు వున్నవారు పెళ్ళికి ముందే హెచ్.ఐ.వి. టెస్ట్ చేయించుకోవడం అవసరం.
ఒక్క ఎయిడ్స్‌వ్యాధి తప్ప తక్కిన సుఖవ్యాధులన్నీ మందులు వాడినట్లయితే కొద్ది రోజులలోనే పూర్తిగా నయమైపోతాయి. హెర్పిస్ సింప్లెక్స్ వ్యాధి ఉన్నవారికి అప్పుడప్పుడు ఆ వ్యాధి లక్షణాలు బయటపడవచ్చు. కాని ఈ వ్యాధి ప్రమాదకరమైనది కాదు. పురుషులలో వ్యాధి లక్షణాలు కనబడినప్పుడు ఆ వారం- పదిరోజులు సెక్స్‌లో పాల్గొనకుండా ఉండటం కాని లేదా నిరోధ్ తొడుక్కుని సెక్స్‌లో పాల్గొనటం కాని చేయాలి. అంతేకాని హెర్పిస్ వ్యాధి వస్తే పెళ్ళి చేసుకోకుండా మానివేయనవసరం లేదు.
పెళ్ళికి క్లీన్ సర్టిఫికేట్

వివాహనికి పూర్వం వేశ్యలతోనూ, ఇతర స్త్రీలతోనూ లైంగిక సంబంధాలు వున్నవారు డాక్టరుచేత పూర్తిగా పరీక్ష చేయించుకోవాలి. తమలో ఏమైనా వ్యాధులు వుంటే అవి తేలేవరకు చికిత్స పొందాలి. ఇందుకోసం డాక్టరుతో ఉన్నదున్నట్లు చెప్పడం అవసరం. కొందరు పురుషులు వి.డి.ఆర్.యల్. రక్తపరీక్ష చేయించుకుని అందులో నెగిటివ్ రిపోర్టు వస్తే తమలో ఏ వ్యాధి లేదనుకుంటారు. కాని వారికి అంగం మీద పుళ్ళు, మూత్రనాళం వెంట చీము మొదలగు లక్షణాలు ఉంటాయి. ఇటువంటి లక్షణాలు ఉన్నా వి.డి.ఆర్.యల్. రిపోర్టు నెగిటివ్ గానే వస్తుంది. కాని వారిలో ఉన్న పుళ్ళు, చీము, సెక్స్‌లో పాల్గొంటే రెండవవారికి వ్యాధిని కలగజేస్తాయి.వి.డి.ఆర్.యల్. రక్తపరీక్ష కేవలం సిఫిలిస్ వ్యాధి శరీరంలో ఉన్నదీ లేనిదీ తెలియ జేస్తుంది. అయితే సిఫిలిస్ వ్యాధి మొదటి దశలో వి.డి.ఆర్.యల్. రక్త పరీక్ష నెగిటివ్ అనే రిపోర్టు వస్తుంది. నెగిటివ్ అని వచ్చినంత మాత్రాన వారి అంగం మీద వున్న పుళ్ళు రెండవ వారికి వ్యాధి కలగచేయదని కాదు. ఆ పుండు తప్పకుండా రెండవ వారికి వ్యాధిని కలగచేస్తుంది.