పురుషాంగం - అనుమానాలు అపోహలు

Suka Samsaram
0
పురుషాంగం గురించి, స్త్రీల యోని గురించి రకరకాల అపోహలు, అభిప్రాయాలు ఉన్నాయి. ఈఅపోహలు చాలా వరకు అపోహలే తప్ప నిజం కాదు.

పురుషాంగం పరిమాణం :

పురుషులు చాలామంది తమ పురుషాంగం చిన్నదిగా వుందని అపోహ చెందుతారు. పురుషాంగం చిన్నదిగా వుండటం మగవానికి తగదు అనుకుంటారు. పురుషాంగం పెద్దదిగా వుంటేనే పరిపూర్ణ పురుషుడు అనుకుంటారు. తమ పురుషాంగం చిన్నదిగా వుందనుకుని ఇన్‌ఫీరియారిటి కాంప్లెక్స్‌కి లోనవుతారు. దాదాపు పురుషులందరి పురుషాంగాలు ఒకే పరిమాణంలో ఉంటాయి. అంగం స్తంభించినప్పుడే పెద్దవిగా మారతాయి. విచిత్రం ఏమిటంటే మామూలుగా కాస్త పెద్దదిగా కనిపించే పురుషాంగం స్తంభించినప్పుడు కలిగే పరిమాణం కంటే చిన్నదిగా అనిపించే పురుషాంగం స్తంభించినప్పుడు దానికంటే ఇది పెద్దదిగా కనబడుతుంది. దీనిబట్టి అర్ధం చేసుకోవలసినదేమిటంటే పెద్దదిగా కనిపించే దానికంటే చిన్నదిగా కనిపించే పురుషాంగం స్తంభించినప్పుడు మరింత పెద్దది అవుతుంది. పురుషాంగం పరిమాణం బట్టి స్త్రీకి కలిగే తృప్తి ఆధారపడిలేదు. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు పురుషుని పెర్‌ఫార్మెన్స్‌ చక్కగా వుంటే పెద్దదిగా అనిపించే పురుషాంగం కంటే చిన్నదిగా అనిపించే పురుషాంగం ఎక్కువ తృప్తిని ప్రసాదిస్తుంది. కొన్ని ప్రాచీన కామసూత్ర గ్రంథాలలో పురుషాంగం పరిమాణం బట్టి పురుషల లైంగిక కేటగిరీని వేరువేరుగా పేర్కొనడం జరిగింది. కొందరు పురుషాంగం ఆరు అంగుళాలు వుంటే, మరికొందరిది 12 అంగుళాలనీ, ఇంకొందరిది మరింత పెద్దదిగా పేర్కొంటూ ఆయా పురుషులని అశ్వజాతిగా, వృష జాతిగా, శశ జాతిగా పేర్కొనడమైనది. కానీ అవన్నీ అభూత కల్పనలే తప్ప నిజాలు కాదు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top