స్త్రీలకి మూత్రవిసర్జనలో మంట ఎందుకని?

Suka Samsaram
0
స్త్రీలలో మూత్రవాహికల్లో వ్యాధి కలగడానికి వారి జననేంద్రియాల నిర్మాణమే కారణం. ఎక్కువమంది స్త్రీలలో వ్యాధిక్రిములు కిందినుంచి పైకి చేరుతాయి. దీనికి మూత్రనాళం (యరెథ్రా) యోనిద్వారంపైనే వుండటం, మూత్రనాళం చిన్నదిగా వుండటమే కారణం. అందుకని యోని దగ్గర చేరిన క్రిములు అతి తేలికగా, అతి త్వరగా మూత్రనాళం నుంచి మూత్రవాహికలకి, ఆపైకీ ప్రయాణించగలుగుతాయి.

స్త్రీలలో మూత్రసంబంధిత వ్యాధులే ఎక్కువ!
పెళ్ళి అయిన స్త్రీలలో మూత్రవాహికలకి సంబంధించిన ఇన్‌ఫెక్షన్‌ కలగడం ఎక్కువ. ఇటువంటి స్త్రీలకే సెక్స్‌లో పాల్గొన్నప్పుడు తరచు ఇన్‌ఫెక్షన్‌ వచ్చి మూత్రం మంట అనిపించం, తరచు మూత్రం రావడం వుంటుంది. సెక్స్‌లో పాల్గొనడం మానేస్తే ఏ బాధా లేనట్లు అనిపిస్తుంది. యోని దగ్గర, యోని మార్గం లోపల ఎప్పుడూ కొద్దో గొప్పో వ్యాధిక్రిములు వుటాంయి. అవి మామూలుగా ఎటుంటి వ్యాధిని కలిగించకుండ వుటాంయి. అవి మూత్రనాళంలోకి, మూత్రవాహికల్లోకి చేరినప్పుడే వ్యాధిలక్షణాలని కలుగజేస్తాయి.
కొందరు స్త్రీలల్లో మూత్రనాళం సన్నగా వుండి, కాస్త ముడతపివుంటుంది. వారికి మూత్రవాహికలలో క్రిములు చేరి స్థావరం ఏర్పర్చుకుటాంయి. మంచినీళ్ళు తక్కువ తాగేవారిలో మూత్రవాహికకి సంబంధించిన ఇన్‌ఫెక్షన్‌ రావడం ఎక్కువ. చమట ద్వారా నీరు ఎక్కువ కోల్పోయే వారిలోనూ, శారీరక శ్రమ ఎక్కువ చేసేవారిలోనూ, ఎండలో ఎక్కువసేపు వుండేవారిలోనూ మూత్రవాహికలకి సంబంధించిన ఇన్‌ఫెక్షన్‌ రావడం ఎక్కువ.

రోజుకి మూడు లీటర్ల మంచినీళ్ళతో యూరినరి ఇన్‌ఫెక్షన్‌ దూరం.
మూత్రం ఎక్కువ అవడనికి నీరు ఎక్కువ తీసుకోవాలి. రోజుకి కనీసం మూడు లీటర్ల నీరు తాగాలి. ప్రతి ఒక్కరు రోజుకి 3 నుంచి 5 లీటర్ల నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ప్రవహించే నీరులో మురికి నిలువ లేనట్లే మూత్రం ఎక్కువ అయ్యేవారిలో మూత్రవాహికల్లో ఇన్‌ఫెక్షన్‌ కలగం అరుదు.
షుగర్‌ వ్యాధి వున్నవారిలో మూత్రం ఎక్కువ అవడం వుంటుంది. అయినప్పికీ వారిలో మూత్రవాహికల ఇన్‌ఫెక్షన్‌ రావడం ఎక్కువ. బెల్లం వున్న చోట చీమలు చేరేవిధంగా మూత్రంలో షుగర్‌ వుండబట్టి వ్యాధిక్రిములు చేరుతాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top