పురుష జననేంద్రియ విజ్ఞానం...

Suka Samsaram
0
పురుష జననేంద్రియాలని రెండు భాగాలుగా విభజించవచ్చు. 
1. బాహ్య జననేంద్రియాలు 
2. అంతర్‌ జననేంద్రియాలు 
బాహ్యంగా కనబడే జననేంద్రియాలలో 1. పురుషాంగం 2. బీజకోశం. దీనినే బీర్జాలు లేదా వృషణాలు అంటారు.
పురుషాంగ నిర్మాణం ప్రత్యేకత కలిగి ఉంది. పురుషాంగంలో ఎటువంటి ఎముక ఉండదు. అలాగే కాళ్ళకి, చేతులకి ఉండే విధంగా గట్టి కండరము ఉండదు. పురుషాంగంలో స్పాంజిలాగ ఉండే టిష్యు మాత్రమే ఉంటుంది. అందువల్ల మామూలు సమయంలో దీనిని ఎటు కావాలంటే అటు తిప్పవచ్చు. ముడవవచ్చు.  

పురుషాంగంలో మెత్తని టిష్యు పురుషాంగంలో కార్పస్‌ నోజం , కేర్పస్ ప్పాంజియోజం,  అనే టిష్యులు ఉంటాయి. పురుషాంగం నుంచే మూత్రనాళం ప్రయాణిస్తుంది. మూత్రనాళం గుండ వీర్యం కూడ బయటికి వస్తుంది. పురుషాంగం చివరి భాగం గుండ్రంగా ఉంటుంది. దీనినే శిశ్నం అంటారు. ఈ శిశ్నంపైన మూతగా చర్మం ఉంటుంది. దీనిని పురుషాంగ పూర్వచర్మం అంటారు. ఈ చర్మం శిశ్నంపైన అంటుకుని ఉండదు. తేలికగా శిశ్నం ముందుకీ వెనకకీ కదులుతుంది.

శిశ్నం వెనక భాగాన చిన్న చిన్న గ్రంథుంలు అనేకం ఉంటాయి. వీటి నుంచి ఎప్పుడూ ఒక రకమైన ద్రవ పదార్థం తయారవుతూ శిశ్నం తడిగా ఉండేటట్లు చేస్తుంది. శిశ్నాన్ని మూసి ఉంచే చర్మాన్ని రోజూ వెనుకకు తీసి శుభ్రం చేయకపోతే శిశ్నం మీద పాచిలాగ తయారై దుర్గంధాన్ని కలిగిస్తుంది. పురుషాంగంలోని టిష్యూ ఉబ్బే గుణం, సాగే గుణం కలిగి ఉంటాయి. సెక్స్‌ పరమైన కోరిక కలగగానే పురుషాంగంలోని ధమనులు ద్వారా వేగంగా రక్తం దూసుకు వచ్చి పురుషాంగంలోని టిష్యు గదుల్లోకి చేరుతుంది. దానితో పురుషాంగ పరిమాణం బాగా పెరుగుతుంది. దీనినే అంగ స్తంభనం అంటారు. అంగ స్తంభనం కలిగితేనే పురుషుడు సెక్స్‌లో పాల్గొనగలుగుతాడు.

బీజకోశంలో వృషణాలు
పురుషాంగ క్రింద భాగమున ఒక సంచిలాగ ఉంటుంది. దీనినే బీజకోశం అంటారు. ఇందులో రెండు వృషణాలు (టెస్టికల్స్‌) ఉంటాయి. ఇవి వీర్యకణాలని ఉత్పత్తి చేయడమే కాకుండ పురుష సెక్స్‌ హార్మోన్‌ని తయారు చేస్తాయి. వృషణాల్లో తయారై వీర్యకణాలు వీర్యవాహికల ద్వారా ప్రయాణించి శుక్రకోశాల్లోకి చేరుతాయి. బీజకోశానికి ఉండే చర్మం చలికి ముడుచుకునేటట్లు వేడికి సాగేటట్లు ఉంటుంది.దీ నికి కారణం ఈ చర్మానికి పల్చని కండరపు పొర అంటుకుని ఉండటమే. వృషణాలు వీర్యకణాలని తయారుచేసినా అవి శుక్రకోశాల్లో ఉండిపోతాయి. సెక్స్‌కోరిక విపరీతంగా కలిగినప్పుడో, సెక్స్‌లో పాల్గొన్నప్పుడో వీర్యకణాలు బయటికి వస్తాయి. అయితే శుక్రకోశాల్లో ఉన్న వీర్యకణాలు తేలికగా బయటకి రావడనికి పల్చని ద్రవం అవసరం. ఈ ద్రవం మూత్రకోశానికి దిగువున ఉండే ప్రోస్టేట్  గ్రంథి నుంచి తయారవుతుంది. ముద్దగా ఉండే వీర్యకణాలు  ప్రోస్టేట్ గ్రంథి విడుదల చేసే ద్రవంతో కలిసి తేలికగా బయటకి వస్తాయి.

సెక్స్‌ హార్మోన్లు
టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ వృషణాల నుంచి తయారవుతుంది. ఈ హార్మోన్‌ పురుషుడు పురుషుడుగా కనబడానికి తోడ్పడుతుంది. స్త్రీలల్లో ఓవరీస్‌ నుంచి స్త్రీ సెక్స్‌ హార్మోన్లు అయిన ఈస్ట్రోజన్‌, ప్రొజిస్టిరోన్‌ తయారవుతాయి. ఇవి స్త్రీ లక్షణాలని పెంపొందిస్తాయి. స్త్రీ-పురుషులిద్దరిలోనూ సెక్స్‌ హార్మోన్‌ పాత్ర గణనీయంగా ఉంటుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top